తెలంగాణ ఆడబిడ్డ పరువుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భంగం కలిగించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఎలాంటి ఆధారాలూ లేకుండానే ఎమ్మెల్సీ కవిత ఫోన్లు ధ్వంసం అయ్యాయని ఆయన మాట్లాడారని ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్.. కేంద్ర మంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు.  

ఏ ఆధారాలు లేకుండానే ఎమ్మెల్సీ కవిత ఫోన్లు ధ్వంసం అయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎలా మాట్లాడారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆడబిడ్డపై ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంజసం అని అన్నారు. తన ఫోన్లు భద్రంగా ఉన్నాయని గతంలోనే కవిత చెప్పారని, ఈడీ తీసుకురావాలని నిన్న కోరితే మంగళవారం తీసుకొస్తానని తెలిపారని అన్నారు.వాటిని ఓ లేఖ ద్వారా ఈడీ కి సమర్పించారని తెలిపారు. దీనికి కిషన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.

ఆరేళ్ల కాపురం తర్వాత భార్య సొంత చెల్లి అని తెలిసింది.. ఖంగుతిన్న భర్తకు నెటిజన్లు ఏమని సూచించారంటే?

ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు రాని మెడికల్ కాలేజి వచ్చిందని చెప్పారని ఆరోపించారు. ఆయన మతి భ్రయమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కిషన్ రెడ్డికి ఒక ఆడబిడ్డ ఉందని, ఒకరి మీద మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఆడబిడ్డ ప్రతిష్టకు భంగం కలిగించారని అన్నారు. 

తెలివిగా తప్పించుకుంటున్నారు: పేపర్ లీక్ లో కేటీఆర్ పై రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్ ను ఎదుర్కోలేక ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యవహారాలకు పాల్పడుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఈ విషయంలోని యువత, మేథావులు, నాయకులు ఆలోచిస్తున్నారని అన్నారు. మీ నీరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యా, ఆదానీలవి లక్షల కోట్లు ఆవిరైపోయాయని అన్నారు. చోక్సీ భాయి ని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రెడ్ కార్నర్ నోటీసులను ఉపసంహరించుకుంటూ రెడ్ కార్పెట్ వేస్తున్నారని ఆరోపించారు. లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తులను వదిలేశారని అన్నారు. దేశ సంపద దోచుకొని యూకే లో జల్సాలు చేస్తున్నారని చెప్పారు. దోస్తులను వదిలేసి... తెలంగాణ బిడ్డను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. 

పేపర్ లీక్ .. తాడు బొంగరం లేనొళ్లంతా మాట్లాడేవాళ్లే : విపక్షాలపై మంత్రి తలసాని ఆగ్రహం

పది నెలలుగా ఒక ఆడబిడ్డను వేధిస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎప్పుడు పిలిచినా విచారణకు ఎమ్మెల్సీ కవిత వచ్చారని, ఊరికే గంటలు గంటలు కూర్చోబెట్టారని తెలిపారు. ఈ విషయంలో కొన్ని టీవీ ఛానెళ్లు పైశాచిక ఆనందం పొందుతున్నాయని అన్నారు. నాలుగో స్థంభంగా ఉన్న మీడియా చాలా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ : నిందితుల ఇళ్లలో సిట్ సోదాలు

తెలంగాణలో ఉన్నట్టు ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా పరిపాలన ఉందా అని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను పిసికేస్తున్నారని అన్నారు. కేసులున్న వాళ్ళు బీజేపీలో చేరితో గంగా నదిలో మునిగినట్టు పాపాలు పోతాయనే విధంగా చేస్తున్నారని అన్నారు. చేతనైతే తెలంగాణకు మేలు చేయాలని తెలిపారు. కానీ ఈ రకంగా వ్యవహరించడం దేశానికి మంచిది కాదని అన్నారు. సౌత్ గ్రూప్ పేరుతో మహిళను ఇబ్బంది పెడుతున్నారని, ఎన్ని కేసులు పెట్టిన న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని చెప్పారు.