Asianet News TeluguAsianet News Telugu

ఏడుగురు బాలురపై హాస్ట‌ల్ వార్డెన్ లైంగిక వేధింపులు.. నిందితుడిని అరెస్టు చేసిన హ‌య‌త్ న‌గ‌ర్ పోలీసులు

హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ కు చెందిన హాస్టల్ వార్డెన్ స్టూడెంట్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో హయత్ నగర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Hostel warden sexually molested seven minor boys.  The accused was arrested by Hayat Nagar police
Author
First Published Sep 12, 2022, 11:18 AM IST

మైనర్ బాలుర‌పై ఆ వార్డెన్ అనుచితంగా ప్ర‌వ‌ర్తించాడు. పిల్ల‌లు అని కూడా చూడ‌కుండా వారిని అస‌భ్యంగా తాకాడు. దీంతో విద్యార్థులు ఈ విష‌యాన్ని త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌జేశారు. త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో ఆ వార్డెన్ అరెస్టు చేశారు. ఇది హైద‌రాబాద్ లో చోటు చేసుకుంది.

ఏడేళ్ల క్రితం పెళ్లి, ఆరునెలలుగా మరొకరితో ప్రేమ.. వివాహానికి ఒప్పుకోలేదని.. ఇద్దరూ ఆత్మహత్య...

విద్యార్థుల ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ప్రైవేట్ పాఠశాల ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న బాయ్స్ హాస్టల్ వార్డెన్ ను హయత్ నగర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఏడుగురు బాలురు వార్డెన్ పై వేర్వేరుగా ఫిర్యాదులు చేశారని హయత్ నగర్ పోలీసులు తెలిపారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

35 ఏళ్ల నిందితుడు నెల రోజుల క్రితం ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన హాస్టల్ట్స్ లో వార్డెన్ గా చేరాడు. అత‌డికి ఇంకా పెళ్లి కాలేదు. దీంతో తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయిన అత‌డు తన లైంగిక కోరికలను తీర్చుకోవడానికి హాస్టల్స్ లో విద్యార్థులను ఉప‌యోగించుకోవాల‌ని నిర్ణయించుకున్నాడు. హాస్ట‌ల్ ఉన్న స‌మ‌యంలో కొంత మంది పిల్ల‌ల‌ను బెదిరిస్తూ గాడ్జెట్ ల‌లో పోర్న్ వీడియోలు చూసేలా చేశాడు. అనంత‌రం ఒంటరిగా నిద్రిస్తున్న విద్యార్థుల గదుల్లోకి వెళ్లి వారిని అనుచితంగా తాకి వేధింపులకు గురి చేశాడు. 

కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఏడు బిల్లులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం..

ఇంత‌టితో అత‌డి ఆఘ‌డాలు ఆగ‌లేదు. మైనర్లు స్నానం చేస్తున్నస్తుప్పుడు వాష్ రూమ్ లోకి చొరబడి వారి శ‌రీరంపై అస‌భ్యంగా తాకేవాడు. ఇలా చాలా సందర్భాలలో జరిగింది. మొత్తంగా  నిందితుడు హాస్టల్ లోని ఏడుగురు మైనర్ విద్యార్థులను భయపెట్టి లైంగికంగా వేధించేవాడు. ఈ విష‌యం ఎవ‌రికీ చెప్ప‌వ‌ద్ద‌ని వారిని బెదిరించేవాడని హయత్ నగర్ పోలీసులు తెలిపారు.

గోదావరికి పెరిగిన వరద: సెక్రటేరియట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశం

అయితే కొందరు మైనర్ బాలురు దీనిని భ‌రించ‌లేక వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు ఈ సమస్యను హయత్ నగర్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 506 (నేరపూరిత బెదిరింపు) కింద ఏడు కేసులు నమోదు చేశారు. రెండు రోజుల పాటు విచారణ జరిపి నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం హాస్టల్స్ లో వార్డెన్ ను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ప్ర‌స్తుతం కేసు ద‌ర్యాప్తులో ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios