Asianet News TeluguAsianet News Telugu

నిజామాబాద్ లో కలకలం.. దయ్యం భయంతో హాస్టల్ ఖాళీ...!!

మంగళవారం రాత్రి స్టడీ అవర్స్ లో భాగంగా చదువుకుంటున్న విద్యార్థినులకు గదిలో నీడలాగ ఒక ముఖం కనిపించిందని, వెనకనుంచి తోసేసినట్టుగా అనిపించిందని, వింత శబ్దాలు వినిపించాయని చెప్పారు. దీంతో బెదిరిపోయిన విద్యార్థినులు బుధవారం ఉదయమే సొంత ఊర్లకు వెళ్లిపోయారు. 

Hostel vacated in Nizamabad due to fear of ghosts
Author
Hyderabad, First Published Nov 18, 2021, 12:45 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్ పేట ఆదర్శ కళాశాల Hostel విద్యార్థినులు దయ్యం భయంతో వసతి గృహాన్ని ఖాళీ చేశారు. మంగళవారం రాత్రి స్టడీ అవర్స్ లో భాగంగ చదువుకుంటున్న విద్యార్థినులకు గదిలో నీడలాగ ఒక ముఖం కనిపించిందని, వెనకనుంచి తోసేసినట్టుగా అనిపించిందని, వింత శబ్దాలు వినిపించాయని చెప్పారు. 

దీంతో బెదిరిపోయిన విద్యార్థినులు బుధవారం ఉదయమే సొంత ఊర్లకు వెళ్లిపోయారు. కాగా విద్యార్థినులు home sick తోనే వెళ్లి పోయారని, తిరిగి రాగానే వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీలత తెలిపారు. అయితే దీంట్లో ఎంత వరకు నిజం ఉంది, ఇవి వట్టి పుకార్లా? ఎవరైనా విద్యార్థినులను భయపబెట్టించడానికి ఇలా చేశారా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ వార్త జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

ఇదిలా ఉండగా, దయ్యం పేరుతో మోసాలు జరగడం మామూలే. గతంలో ఇలాంటి మోసాలు అనేకం జరిగిన సంగతి తెలిసిందే. సంవత్సరం కిందట ఓ మోసగాడు.. భర్త ఆర్ధిక ఇబ్బందులకు కారణం భార్యకు దయ్యం పట్టడమే అని నమ్మబలికి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడో దొంగబాబ. 

మౌలాలి పరిధిలో నివాసముంటున్న ఒక వ్యక్తి తన ఆర్ధిక ఇబ్బందులకు పరిష్కారం చూపమని నిజామాబాదు కి చెందిన యూనుస్ ఖాన్ అలియాస్ ముష్రద్ అనే fake Babaను ఆశ్రయించాడు.

బాధితుడి ఆర్ధిక ఇబ్బందులకు కారణం అతగాడి wife కారణం అని, ఆమెకు ghost పట్టడం వల్లే అనర్థాలు జరుగుతున్నాయని చెప్పాడు. తన దగ్గరకు ఆ బాధితుడి భార్యను తీసుకురమ్మని, తీసుకొస్తే... ఆమెకు పట్టిన దయ్యాన్ని వదలగొడతానని చెప్పాడు. ఆ ప్రకారంగానే తన భార్యను తీసుకొచ్చి ఆ బాబా దగ్గర వదిలి వెళ్ళాడు. బాబా చెప్పినట్టుగా వినాలని భార్యకు హితబోధ కూడా చేసాడు సదరు భర్త. భర్త వదిలి వెళ్లిన తరువాత భార్యను ఒక రూమ్ లోకి తీసుకెళ్లాడు ఆ దొంగ బాబా. 

ఆర్బీఎల్ బ్యాంక్ స్కాం : బావ, బామ్మర్దులు కలిసి కోట్లకు ముంచారు.. ఆర్బీఎల్ బ్యాంక్ నకిలీ సేవా కేంద్రాల పేరుతో

పూజకు అన్నట్టుగా ఏర్పాట్లు చేసాడు. మంత్రాలు చదువుతూ పూజలు చేస్తున్నట్టుగా build up ఇచ్చాడు. ఈ తతంగం కొద్దిసేపు జరిగిన తరువాత ఆ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఆ దొంగ బాబా. తరువాత అక్కడి నుండి భర్త వచ్చి ఏమీ ఎరగనట్టు తన భార్యను తీసుకొని మౌలాలీలోని తమ ఇంటికి తీసుకెళ్లాడు. 

ఇంటికి వెళ్ళాక భర్తకు అక్కడ ఆ దొంగ బాబా తనమీద చేసిన అఘాయిత్యం గురించి చెప్పింది. భర్త దాన్ని చాలా లైట్ గా తీసుకున్నాడు. దీనితో భర్త ఆ దొంగ బాబాతో కలిసే ఇలా చేసాడని అనుమానం వచ్చిన సదరు మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 

పోలీసులు రంగంలోకి దిగి ఆ దొంగబాబాను నాంపల్లిలో, మహిళా భర్తను మౌలాలీలో అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన వెలుగు చూసిన తరువాత ఇటువంటి ధోనాగబాబాల అంతుచూడాలని, సంఘటనలు పునరావృతం కాకూడదు అని కోరుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios