గద్వాల జిల్లాలో పరువు హత్య చోటు చేసుకుంది. డిగ్రీ చదువుతున్న విద్యార్ధిని దివ్యను ఆమె తల్లిదండ్రులే దారుణంగా హత్య చేశారు. కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందనే కోపంతో గొంతునులిమి హతమార్చారు. మానవపాడు మండలం కలుకుంట్లలో ఈ ఘటన జరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దివ్య తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దివ్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.