హత్యకు దారి తీసిన ఇద్దరు మగాళ్ల మధ్య లైంగిక సంబంధం

Homo Sexual relation leads to murder
Highlights

ఇద్దరు పురుషుల మధ్య అసహజ లైంగిక సంబంధం హత్యకు దారి తీసింంది. 

నల్లగొండ: ఇద్దరు పురుషుల మధ్య అసహజ లైంగిక సంబంధం హత్యకు దారి తీసింంది. నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం ఎనుగుదోరి గ్రామానికి చెందిన పాటి జాన్ రెడ్డి గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్ద హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు.

ఆ కేసు వివరాలను నల్లగొండ డిఎస్పీ సుధాకర్ మీడియాకు వివరించారు. నార్కెట్ పల్లి శివారులోని ఓ ప్రైవెట్ కంపెనీలో పాటి జాన్ రెడ్డి (25)తో పాటు కృష్ణా జిల్లా మైలవరం మండలం చంద్రగూడెంకు చెదని మాదాసు ఆరోగ్యం పనిచేస్తున్నారు. ఏడాది కాలంగా ఇరువురి మధ్య అసహజ లైంగిక సంబంధం కొనసాగుతోంది.

ఆరోగ్యం చిన్న కూతురు గత నెల 13వ తేదీన చనిపోయింది. దాంతో అతను మానసికంగా క్రుంగిపోయాడు. అదే సమయంలో తనతో దూరంగా ఉంటున్నావంటూ జాన్ రెడ్డి వేధించడం ప్రారంభించాడు. డబ్బులు ఇవ్వాలని, లేదంటే సంబంధాన్ని అందరికీ చెప్పేస్తానని కూడా బెదిరించాడు.

ఆరోగ్యం విసిగిపోయి ఈ నెల 6వ తేదీన జాన్ రెడ్డితో కలిసి మద్యం సేవించాడు. ఆ తర్ావత ఎనుగులదోరి శివారులోని వ్యవసాయ బావి వద్దకు తీసుకుని వెళ్లి జాన్ రెడ్డిని హత్య చేశాడు. 

loader