రైతులపై నోరు పారేసుకున్న హోమంత్రి నాయిని (వీడియో)

First Published 20, Feb 2018, 12:49 PM IST
Home Minister Nayini ridicules farmers suicides
Highlights
  • సున్నం వేసేవాళ్లు చనిపోతే రైతులేనా?
  • కూలి చేసే వాళ్లు చనిపోతే రైతుల ఖాతాలో వేస్తారా?
  • ప్రెస్ వాళ్లు అదే రాస్తున్నారు
  • పబ్లిక్ కూడా అదే మాట్లాడుతున్నరు

తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి నోరు పారేసుకున్నారు. రైతులపై, రైతు ఆత్మహత్యలపై అడ్డగోలుగా మాట్లాడి వివాదంలో చిక్కుకున్నారు. ముక్కుసూటిగా మాట్లడడం.. ఉన్నది ఉన్నట్లు చెప్పడంలో నాయిని నర్సింహ్మారెడ్డికి పేరుంది. కానీ ఇలా రైతు ఆత్మహత్యలపై ఇట్ల మాట్లాడిండేందని జనాలు ఆగ్రహంగా ఉన్నారు.

సంగారెడ్డిలో పర్యటించిన సందర్భంలో నాయిని నర్సింహ్మారెడ్డి స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా రైతు ఆత్మహత్యల అంశం ప్రస్తావనకు వస్తే.. నాయిని అభ్యంతరకరమైన కామెంట్స్ చేశారు. కూలి చేసుకునే వ్యక్తి చనిపోతే అది రైతు ఆత్మహత్యగా క్రియేట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సున్నం వేసే వ్యక్తి చనిపోయినా రైతు ఆత్మహత్య అంటే ఎలా అని ప్రశ్నించారు.

ప్రెస్ వాళ్లు కూడా అబద్ధాలే రాస్తున్నారని విమర్శించారు నాయిని. డబ్బులొస్తాయి.. పేదోడు అని ప్రెస్ వాళ్లు ఆత్మహత్య చేసుకున్న వాళ్లందరినీ రైతులుగా చిత్రీకరించారని పేర్కొన్నారు. పబ్లిక్ కూడా అదే పద్ధతిలో మాట్లాడుతున్నారని విమర్శించారు.

నాయిని రైతు ఆత్మహత్యలపై ఏమన్నారో కింది వీడియోలో చూడండి.

loader