ఆందోళన విరమించిన హోంగార్డు రవీందర్ భార్య: రేపు అంత్యక్రియలు

హోంగార్డు రవీందర్ భార్య సంధ్య తన ఆందోళనను విరమించారు. పోలీస్ శాఖలో  ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తామని  డీసీపీ  సునీల్ దత్ హామీ ఇచ్చారు. దీంతో ఆమె తన ఆందోళనను విరమించారు.

Home guard  Ravinder Wife  Sandhya Withdraw protest in hyderabad lns

హైదరాబాద్: మృతి చెందిన  హోంగార్డు రవీందర్ భార్య  సంధ్య ఆందోళన విరమించారు.   పోలీస్ శాఖలో  ఉద్యోగమిస్తామని  హామీ ఇవ్వడంతో  సంధ్య  తన ఆందోళనను విరమించారు.  నాలుగు రోజుల క్రితం  ఆత్మహత్యాయత్నం చేసిన రవీందర్  డీఆర్‌డీఓ  కంచన్ బాగ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  శుక్రవారంనాడు మృతి చెందారు. స్థానిక  డీసీపీ సునీల్‌దత్....  సంధ్యతో చర్చలు జరిపారు.  నాలుగు దఫాలు చర్చించారు. ఈ చర్చలు ఫలవంతమయ్యాయి.  రెండు రోజుల తర్వాత  సీపీ వద్దకు  తీసుకెళ్లనున్నట్టుగా డీసీపీ హామీ ఇచ్చారు.   హోంగార్డు ఉద్యోగం కాకుండా పోలీస్ శాఖలో  మరో ఉద్యోగం  ఇప్పించే ప్రయత్నం చేస్తామని  సంధ్యకు డీసీపీ హామీ ఇచ్చారు.  ఈ హామీతో  సంధ్య సానుకూలంగా స్పందించారు.  

also read:హోంగార్డు రవీందర్ మృతికి కారకులను శిక్షించాలి: తెలంగాణ హైకోర్టులో పిటిషన్ 

సంధ్య  ఆందోళన విరమించడంతో  రవీందర్ మృతదేహనికి పోస్టుమార్టం ప్రారంభం కానుంది.  పోస్టుమార్టం కోసం అవసరమైన ప్రక్రియను పూర్తి చేయనున్నారు.ఈ ప్రక్రియను పూర్తి చేసి రవీందర్ మృతదేహన్ని  కుటుంబ సభ్యులకు అందించనున్నారు. రేపు రవీందర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.అంత్యక్రియల తర్వాత  పోలీస్ ఉన్నతాధికారుల వద్దకు  రవీందర్ భార్యను  తీసుకెళ్లనున్నారు  సునీల్ దత్.  ఉద్యోగం విషయమై చర్చించనున్నారు.

తన భర్తపై  కానిస్టేబుల్ చందు,  ఎఎస్ఐ నర్సింగరావు  పెట్రోల్ పోసి నిప్పంటించారని  సంధ్య ఆరోపించారు.  ఈ విషయాన్ని తన భర్త తనకు చెప్పారని సంధ్య ఆరోపించారు. వీరిద్దరిన కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.  తన  భర్త సిన్సియర్ గా విధులు నిర్వహించేవాడని  సంధ్య చెప్పారు.  తన భర్త మృతి వెనుక మిస్టరీని బయటపెట్టాలని సంధ్య కోరారు. 

సంధ్య ఇవాళ ఉస్మానాయా  ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్, సీపీఐలు మద్దతు ప్రకటించాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావులు  సంధ్యకు సంఘీభావం తెలిపారు.  రవీందర్  మృతికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని వారు ఆరోపించారు.ఈ విషయమై బాధ్యులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్  చేశారు. హోంగార్డు కార్యాలయం వద్ద సీసీటీవీ పుటేజీని బయట పెట్టాలని  రవీందర్ భార్య కోరుతున్నారు. 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios