సచివాలయం ముట్టడికి ప్రయత్నంజీతాలు పెంచాలంటూ డిమాండ్సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్తతలాఠీ చార్జ్ చేసిన పోలీసులుసెల్ ఫోన్ సిగ్నల్ కట్ చేసిన అధికారులు
దీర్ఘకాలంగా ఉన్న తమ డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో హొంగార్డులు కదం తొక్కారు. కొద్దిరోజులుగా ఇందిరాపార్కు వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారు ఈరోజు తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేశారు. సీఎస్ రాజీవ్‌శర్మతో జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో సచివాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. ఇందిరాపార్కు నుంచి భారీ ర్యాలీగా తరలివచ్చిన హోంగార్డులు ఒక్కసారిగా సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా సచివాలయం గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేపట్టారు.
12 డిమాండ్లతో పోరు బాట...
తమ ఉద్యోగాలను పర్మింనెట్ చేయాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలి, సెలవులు మంజూరు చేయాలని తదితర 12 డిమాండ్లతో హోంగార్డలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
రాష్ట్రం వచ్చినా పరిస్థితి మారలేదు...
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ హోంగార్డులపై భారీగా హామీలు గుప్పించారు. రాష్ట్రం వచ్చాక హోంగార్ఢులందరినీ పోలీసులతో సమానంగా పరిగణిస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మింనెట్ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం వచ్చి రెండేళ్లైనా ఇప్పటిరవకు ఆ హామీలకు దిక్కు లేకుండా పోయింది. దీంతో హొంగార్డలు ఇలా తమ డిమాండ్ల కోసం రోడ్డెక్కి పోరాడాల్సి వస్తొంది.
ఇటీవల టీ జేఏసీ చైర్మన్ కోదండరాం కూడా హొంగార్డుల డిమాండ్లకు మద్దతు పలికారు. బీజేపీ నేత కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హొంగార్డులకు జీతాలు పెంచాలంటూ నిరహార దీక్ష కూడా చేశారు. తాజాగా ఇప్పడు హోంగార్డులు తమ స్వరం పెంచి పోరుబాట పట్టారు.
