నాగర్ కర్నూలు జిల్లాలో హోంగార్డ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హోంగార్డ్ వెంకటేష్ రెండ్రోజుల క్రితం మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన సందర్భంగ బందోబస్తు విధులకు వచ్చాడు.

నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ హోంగార్డ్ స్థానిక అడవిలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఈగల పెంట పోలీస్ స్టేషన్‌కు చెందిన హోంగార్డ్ వెంకటేష్ రెండ్రోజుల క్రితం మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన సందర్భంగ బందోబస్తు విధులకు వచ్చాడు. అయితే అనూహ్యంగా వెంకటేష్ అదృశ్యమయ్యాడు. దీంతో ఉన్నతాధికారులు అతని కోసం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో గురువారం మన్ననూరు నుంచి ఉమామహేశ్వరం వైపు వెళ్లే మార్గంలో వెంకటేష్ మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని కిందకి దించి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేశ్ ఆత్మహత్య వ్యవహారం పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.