హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టులకు ఊతం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కల సాకారం చేసే లక్ష్యంగా హెచ్ఎండిఏ చేస్తున్న ప్రయత్నాలకు మరింత వెసులుబాటు కల్పించింది
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టులకు ఊతం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కల సాకారం చేసే లక్ష్యంగా హెచ్ఎండిఏ చేస్తున్న ప్రయత్నాలకు మరింత వెసులుబాటు కల్పించింది.
దీని ప్రకారం... ఇప్పటి వరకు ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్ట్ ఆక్టివిటీ కింద ఉన్న నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకు వచ్చింది. భూమి యజమానుల నుంచి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కింద ఇప్పటి వరకు అమలులో ఉన్న 50 : 50 శాతాన్ని 60 : 40 శాతంగా ఖరారు చేసింది.
ఇందులో భూ యజమానులకు 60 శాతం, హెచ్ఎండిఏకు 40 శాతం చొప్పున ఉంటుంది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ ఉత్తర్వులు (జీవో నెం.83) జారీ చేశారు.
దీంతో హెచ్ఎండిఏకు ల్యాండ్ పూలింగ్ కోసం భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చే వారికి పూర్తి స్థాయి భద్రత, ఎక్కువ శాతం ప్రయోజనం చేకూరనున్నది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కోసం భూములు ఇచ్చే వారికి ఆర్ధికపరమైన సమస్యలు లేకుండా అన్ని రకాల అనుమతులకు సంబంధించిన వ్యవహారాలన్నీ హెచ్ఎండిఏ నిర్వహిస్తుంది.
అందులో భాగంగా ‘నాలా’ ఛార్జీలతో పాటు ల్యాండ్ యూజ్ కన్వర్షన్ ఛార్జీలను హెచ్ఎండిఏ భరిస్తుంది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కోసం భూములు ఇచ్చిన వారి రిజిస్ట్రేషన్ ఖర్చులను సైతం హెచ్ఎండిఏ భరిస్తుంది.హెచ్ఎండిఏ లేఔట్ డ్రాఫ్ట్ అప్రూవల్ అయిన నాటి నుంచి ఆరు నెలల లోపు ల్యాండ్ ఓనర్స్ కు ప్లాట్లు కేటాయిస్తారు.
భూ యజమానులకు కేటాయించిన ప్లాట్లు వారి ఇష్టానుసారంగా విక్రయించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు 500 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి.
