ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల గేట్ల ఎత్తివేత: మూసీ పరివాహక ప్రాంతాల్లో అలెర్ట్

హైద్రాబాద్ జంట జలాశయాలకు భారీ వరద వచ్చి చేరింది. దీంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల గేట్లను ఎత్తివేశారు.చాదర్ ఘాట్ వద్ద అండర్ బ్రిడ్జి వద్ద వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధిారులు అప్రమత్తం చేశారు. 

Himayat Sagar And Osman Sagar Gates Lifted

హైదరాబాద్: Hyderabad  జంట జలాశయాలకు భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో Osman sagar, హిమాయత్ సాగర్ ల గేట్లను అధికారులు ఎత్తివేశారు.భారీ వర్షాల నేపథ్యంలో మూసీకి వరద పోటెత్తింది. దీంతో మంచిరేవులకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.  Musi నదిపై మూసారాంగ్ వద్ద నిర్మించిన బ్రిడ్జి పై నుండి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో  బ్రిడ్జిపై  వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

మూసారాంబాగ్ బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోకి  కూడా వరద నీరు పోటెత్తింది. దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.  మంగళవారం నాడు రాత్రి  మూసీ వరద ప్రవాహం భారీగా ఉండడంతో ముంపు వాసులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. మూసారాంబాగ్ కు ఎవగువన ఉన్న చాదర్ ఘాట్ బ్రిడ్జి వద్ద కూడా మూసీ వరద నీరు పోటెత్తింది. చాదర్ ఘాట్ అండర్ బ్రిడ్జి వద్ద వాహనాల రాకపోకలను నిలిపివేశారు అధికారులు, చాదర్ ఘాట్ అండర్ బ్రిడ్జి సమీపంలో ఉన్న మూసా నగర్, శంకర్ నగర్ వంటి బస్తీల్లో వరద నీరు చేరింది.  గతంలో కూడా నగరంలో భారీ వర్షాలు కురిసిన సమయంలో ఈ బస్తీలు వరదలో ముంపునకు గురయ్యాయి. ఈ దఫా కూడా అధికారులు ఈ బస్తీ వాసులను హెచ్చరించారు.  మూసీకి ఇంకా వరద పెరిగితే చాదర్ ఘాట్ వద్ద మూసీపై నిర్మించిన బ్రిడ్జికి ఇరు వైపులా ఉన్న బస్తీ  వాసులను ఖాళీ చేయించనున్నారు అధికారులు. 

Chaderghat అండర్ బ్రిడ్జి వద్ద పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మోహరించారు. మూసీకి వరద తగ్గితే అండర్ బ్రిడ్జిపై రాకపోకలను కొనసాగించే  అవకాశాలపై అధికారులు చర్యలు నిర్ణయం తీసుకొంటారు.మరో వైపు పురానాపూల్ వద్ద ఉన్న బ్రిడ్జి మూసీ ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా అధికారులు వాహనాల రాకపోకలను నిషేధించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలను మళ్లించారు. వరద ప్రవాహం తగ్గితే ఈ మూడు బ్రిడ్జిల నుండి వాహనాల రాకపోకలను పునరుద్దరించాలని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

also read:వికారాబాద్‌‌లో కుండపోత వర్షం.. పలు ప్రాంతాలకు నిలిచిన రాకపోకలు..

Hyderabad లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు వరద పోటెత్తింది. ఉస్మాన్ సాగర్, Himayat sagar గేట్ల ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ కు చెందిన ఎనిమిది గేట్లను ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ కు చెందిన ఆరు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ఉస్మాన్ సాగర్ కు 4,300 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. 

నైరుతి రుతుపవనాల ప్రవేశం నుండి రాష్ట్రంలో భారనీగా వర్షాలు కురుస్తున్నాయి. గత 10 రోజుల క్రితం గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ ఎత్తున వర్షాలు కురిశాయి. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని జీవనం సాగించారు. అయితే మరోసారి వర్షాలు కురుస్తుండడంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios