టీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు దీక్షలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సీనియర్ నేతలు జానారెడ్డి, వీహెచ్‌ల మధ్య సరదా సంవాదం నెలకొంది.

నాగార్జున సాగర్‌లో జానారెడ్డి గెలవాలని వీహెచ్ కోరగా.. మధ్యలో కలగజేసుకున్న జానారెడ్డి, తాను కాదు కాంగ్రెస్ గెలవాలని అన్నారు. మీరు కాంగ్రెస్ కాదా..? అంటూ వీహెచ్ కౌంటరిచ్చారు.

ఢిల్లీలో రైతు దీక్షకు విరాళం అడిగారు వీహెచ్.. అయితే జేబులో ఎంత ఉంటే అత ఇస్తా తీసుకో అన్నారు జానారెడ్డి. పది వేలు తీసుకుని .. ఇంకో లక్ష ఇవ్వమన్నారు వీహెచ్.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో సీఎల్పీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దీక్ష నిర్వహించింది. ఈ దీక్షలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, పొదెం వీరయ్య ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వీ.హెచ్,  కోదండరెడ్డి, సిరిసిల్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

అంతకు ముందు యూత్ కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా తరలివచ్చారు. దారిపొడవునా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.