హైదరాబాద్‌లో కేవీ రంగారెడ్డి కాలేజ్‌లో హిజాబ్ వివాదం.. హోం మంత్రి మహమూద్ అలీకి ఫిర్యాదు..!!
హైదరాబాద్‌లోని ఐఎస్ సదన్ చౌరస్తాలోని కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో హిజాబ్ వివాదం తెరమీదకు వచ్చింది. హిజాబ్ ధరించి పరీక్ష రాసేందుకు వచ్చిన ముస్లిం విద్యార్థినులను కాలేజ్ సిబ్బంది చెప్పడం వివాదానికి దారితీసింది.
హైదరాబాద్‌లోని ఐఎస్ సదన్ చౌరస్తాలోని కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో హిజాబ్ వివాదం తెరమీదకు వచ్చింది. హిజాబ్ ధరించి పరీక్ష రాసేందుకు వచ్చిన ముస్లిం విద్యార్థినులను కాలేజ్ సిబ్బంది చెప్పడం వివాదానికి దారితీసింది. వివరాలు.. సంతోష్‌నగర్ ఐఎస్ సదన్ చౌరస్తాలోని కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన డిగ్రీ ఉర్దూ మీడియం సప్లిమెంటరీ పరీక్షకు పలువురు ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి వచ్చారు. అయితే పరీక్షా కేంద్రంలోకి హిజాబ్‌తో రావద్దని కాలేజ్ సిబ్బంది సూచించినట్టుగా తెలుస్తోంది. దీంతో విద్యార్థినులకు, కాలేజ్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలోనే కొందరు విద్యార్థులు హిజాబ్ తీసేసి పరీక్షా కేంద్రంలోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో హిజాబ్‌తోనే విద్యార్థినులను పరీక్షకు అనుమతించినట్టుగా తెలుస్తోంది. ఇక, పరీక్ష కేంద్రానికి వచ్చిన తమను హిజాబ్ ఉందనే కారణంతో దాదాపు అరగంట పాటు లోనికి అనుమతించలేదని విద్యార్థినులు చెప్పారు. హిజాబ్ తొలగించిన తర్వాతే పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో కాలేజ్ యాజమాన్యం ఇలా ప్రవర్తించలేదని అన్నారు. మరుసటి రోజు పరీక్షకు హిజాబ్ లేకుండానే రావాలని కాలేజ్ యాజమాన్యం చెప్పిందని వారు చెప్పుకొచ్చారు. అయితే హిజాబ్‌తో పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కాలేజ్ నిర్వాహకులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి విద్యార్థినుల తల్లిదండ్రులు రాష్ట్ర హోం మంత్రికి మహమూద్ అలీకి ఫిర్యాదు చేశారు. ముస్లిం మహిళలకు హిజాబ్ అనేది సర్వసాధారణమని చెప్పారు. పరీక్షా కేంద్రంలోకి హిజాబ్‌తో విద్యార్థినులను అనుమతించకపోవడంపై విచారణ జరిపించి, చర్యలు తీసుకుంటామని అన్నారు. కాలేజ్ నిర్వాహకులతో మాట్లాడతామని తెలిపారు.