యువతి మరణానికి గ్రామానికి చెందిన యువకుడే కారణమంటూ కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేటలో అతని ఇంటిపై బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు దాడికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేటలో ఆదివారం ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఇటీవల ఓ యువతి మరణానికి సంబంధించి గ్రామంలో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన యువకుడే కారణమంటూ అతని ఇంటిపై మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు దాడికి దిగారు. యువకుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లకుండా పోలీసులను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో లాఠీఛార్జీ చేసి గ్రామస్తులను చెదరగొట్టారు పోలీసులు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
