Asianet News TeluguAsianet News Telugu

వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ ఆందోళన, అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు.. మహబూబ్‌నగర్‌లో ఉద్రిక్తత

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్), బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వర్గీకరణపై తేల్చాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న ప్రాంతంలో ఆందోళనకు దిగారు. 
 

high tension at mahabubnagar over fighting between mrps leaders and bjp activists
Author
First Published Jan 24, 2023, 5:58 PM IST

మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్), బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వర్గీకరణపై తేల్చాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న ప్రాంతంలో ఆందోళనకు దిగారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. అటు బీజేపీ కార్యకర్తలు కూడా పోటాపోటీగా నినాదాలు చేయడంతో పాటు కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ గాయపడగా.. పోలీస్ వాహనం ధ్వంసమైంది. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలోనూ బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న ప్రాంతంలో ఎంఆర్పీఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios