Asianet News TeluguAsianet News Telugu

మునుగోడులో ప్రలోభాల పర్వం.. చౌటుప్పల్‌లో కారును పట్టుకున్న స్థానికులు, ఉద్రిక్తత

మునుగోడు ఉపఎన్నిక వేళ చౌటుప్పల్‌లో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. బుధవారం కొందరు డబ్బులు పంచుతున్నారని తెలియడంతో స్థానికులు అడ్డుకున్నారు. ఆగ్రహంతో వున్న జనం కారు అద్దాలను ధ్వంసం చేశారు.

high tension at choutuppal over munugode by poll
Author
First Published Nov 2, 2022, 9:47 PM IST

మునుగోడు ఉపఎన్నిక వేళ ప్రలోభాల పర్వం ఓ రేంజ్‌లో సాగుతోంది. రేపటి పోలింగ్‌కు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రలోభాలు మాత్రం కొనసాగుతూనే వున్నాయి. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు తనిఖీలు చేస్తున్నప్పటికీ కొందరు దొడ్డిదారిలో ఓటర్లకు డబ్బు పంచుతున్నారు. ఈ క్రమంలో బుధవారం కొందరు డబ్బులు పంచుతున్నారని తెలియడంతో స్థానికులు అడ్డుకున్నారు. ఆగ్రహంతో వున్న జనం కారు అద్దాలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు లాఠీఛార్జీ చేసి గుంపును చెదరగొట్టారు. అనంతరం కారును పీఎస్‌కు తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. మరోవైపు .. చౌటుప్పల్ మండలం తూప్రాన్‌లో కారులో తరలిస్తున్న రూ.9 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఇకపోతే.. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడగా.. గురువారం పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా మునుగోడు ఉప ఎన్నిక గురించే చర్చ సాగుతుంది. మునుగోడులో ఎవరు గెలుస్తారనే దానిపై బెట్టింగ్‌లు కూడా జోరుగా సాగుతున్నాయి. అయితే చాలా మంది దీనిని ఖరీదైన ఉప ఎన్నిక అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. మరి క్షేత్రస్థాయిలో మాత్రం చాలా చోట్ల ఓటర్లు తమకు డబ్బు పంచడం లేదంటూ రాజకీయ  నాయకులను నిలదీస్తున్నారు.

ALso REad:రూ. 3 వేలే ఇస్తారా?.. మునుగోడు ఇజ్జత్ తీస్తున్నారు: రాజకీయ పార్టీల తీరుపై ఓటర్ల అసంతృప్తి..!

ప్రచారానికి తెరపడటంతో.. మంగళవారం సాయంత్రం నుంచే పార్టీలు ఓటర్లను ప్రసన్నం  చేసుకునేందుకు తెరవెనక ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కొన్ని పార్టీలు నిన్న సాయంత్రం నుంచే పలుగ్రామాల్లో డబ్బులు పంపిణీ చేపట్టాయి. అయితే డబ్బు పంపిణీ విషయంలో పార్టీల వైఖరిపై మునుగోడు ఓటర్లు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 

మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడినప్పటీ నుంచే నియోజకవర్గంలో ప్రలోభాల పర్వం ప్రారంభమైంది. దిగువ స్థాయి నేతలకు గాలం వేసిన పార్టీలు.. వేరే పార్టీలోని నేతలను తమ పార్టీలోకి వచ్చేలా వారికి భారీ మొత్తంలో చెల్లింపులు చేపట్టాయి. కొన్ని పార్టీలు.. ప్రచారానికి, సభలకు హాజరైనవారికి రోజుకు రూ. 500, భోజనం, కొందరికి మద్యం ఏర్పాటు చేశాయనే టాక్ ఉంది. దీంతో ఓటర్లు పోలింగ్ ముందు భారీగా నగదు పంపిణీ చేస్తారని ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయినట్టుగా కనిపిస్తోంది. 

గత కొద్ది  రోజులుగా తమ ఇళ్ల వద్దకు ప్రచారానికి వచ్చిన నేతలు.. ఓటుకు రూ. 30 వేలు లేదా తులం బంగారం అని చెప్పారని, కానీ ఇప్పుడు మాత్రం రూ. 3 వేల పంచుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లు  రాజకీయ పార్టీల నాయకులను నిలదీస్తున్నారు. మునుగోడులో కొన్నిచోట్ల మినహా.. మెజారిటీ గ్రామాల్లో ఇలాంటి పరిస్థితే చోటుచేసుకుంది. ఇక, చాలా మంది ఓటర్లు పార్టీలు కనీసం రూ. 10 వేల చొప్పున పంపిణీ చేస్తాయని భావించారు. రెండు పార్టీల నుంచి డబ్బులు అందుకున్న రూ. 20 వేలు వస్తాయని ఆశపెట్టుకున్నారు. ఇప్పుడు ఆ విధమైన పరిస్థితులు కనిపించకపోవడంతో రాజకీయ పార్టీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios