తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్,  మేడ్చల్,  మల్కాజిగిరి, సిద్దిపేట,రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల మీదుగా రోడ్డు మార్గంలో కేసీఆర్ మిడ్ మానేరు చేరుకొంటారు. 

సోమవారం నాడు ఉదయం ప్రగతి భవన్ నుండి ఆయన మిడ్ మానేరుకు బయలుదేరుతారు.ఉదయం 10:30 సిద్దిపేట సిరిసిల్ల మీదుగా వేములవాడలో రాజన్నను కేసీఆర్ దర్శించుకొంటారు. ఉదయం 11:30 వేములవాడ నుండి SRR మిడ్ మానేరు కు బయలుదేరుతారు. ఉదయం 11:50 గంటలకు మిడ్ మానేరును సందర్శిస్తారు.

మధ్యాహ్నం 12:30 మిడ్ మానేరు నుండి బయలుదేరుతారు.  అనంతరం ఒంటిగంటలకు కరీంనగర్ తీగలగుట్టలపల్లిలో భోజనం చేస్తారు. మధ్యాహ్నం  03:00 తిరిగి హైదరాబాద్ కు ప్రయాణమౌతారు.

మిడ్ మానేరు డ్యామ్ 25.875 టీఎంసీఎఫ్ లకు చేరుకొంది. మిడ్ మానేరు డ్యామ్ ను పరిశీలించేందుకు ముందుగా సీఎం కేసీఆర్ తొలుత వేములవాడ రాజన్నను దర్శించుకొంటారు. ఆగష్టు మాసంలోనే 15టీఎంసీఎఫ్‌టీలకు డ్యామ్ చేరుకొంది.తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటనను పురస్కరించుకొని పోలీసులు భారీబందోబస్తును ఏర్పాటు చేశారు.