అత్యంత వివాదాస్పదంగా సాగుతోన్న కానిస్టేబుల్ నియామకాల ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతోంది. రిక్రూట్ ప్రక్రియ మొదటి నుంచి వివాదంగానే మారింది.

 

అర్హత మార్కులు, రిజర్వేషన్లలపై సరైన వివరాలు ఇవ్వడం లేదంటూ అభ్యర్థులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కొందరు ఏకంగా తమకు అన్యాయం జరిగిందని కోర్టునే ఆశ్రయించారు.

 

ఈ రోజు కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన వారికి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ను అధికారులు నిర్వహించారు. అయితే ఇదే సమయంలో అభ్యర్థులను షాక్ కు గురు చేసే హైకోర్టు తీర్పు నిచ్చింది.

 

కానిస్టేబుల్స్ ఏంపిక ప్రక్రియను  తాత్కాలికంగా నిలుపదల చేయాలని ప్రభుత్వానికి సూచించింది.

 

వారం రోజుల వరకు నియమక పత్రాలు ఇవ్వోద్దని తన తీర్పులో వెల్లడించింది.