నేరెళ్ల ఘటనపై హైకోర్టు ఆశ్చర్యం అందరికీ ఒకేచోట దెబ్బలు ఎలా తలిగాయని ప్రశ్న పూర్తి వివరాలు కోరిన న్యాయస్తానం విచారణ మరో రెండు వారాలకు వాయిదా
నేరెళ్ల ఘటనపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అందరికీ ఒకేచోట అంత బలంగా దెబ్బలు ఎలా తలిగాయని ప్రశ్నించింది హైకోర్టు. నేరెళ్ల ఘటనపై బుధవారం వాదనలు జరిగాయి. దీనిపై ఈ కేసులో డిఐజిని సుమోటోగా 11వ ప్రతివాదిగా చేరుస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
నెరేళ్ల ఘటన లో గాయపడిన బాధితుల కు ఇద్దరు సీనియర్ MGM వైద్యులతో మెడికల్ ఎక్సామినేషన్ నిర్వహించి రిపోర్ట్ ను హైకోర్టు సమర్పించాలని గతంలో తెలంగాణ ప్రిన్సిపాల్ సెక్రటరీ ని అదేశించింది హైకోర్టు. హైకోర్టు ఆదేశం మేరకు బుధవారం నెరేళ్ల ఘటన లో గాయపడిన వారిపై చేసిన మెడికల్ ఎక్సమినేషన్ రిపోర్ట్ ను షీల్డ్ కవర్ లో సమర్పించింది తెలంగాణ ప్రభుత్వం. నేరెళ్ల ఘటనలో మెడికల్ రిపోర్ట్ లో బాగా గాయాలు అయినట్టు వెల్లడించింది సర్కారు.
ఇంత సీరియస్ గా అందరికి ఒకే చోట ఎందుకు గాయాలు చేసారని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ అడిషనల్ అడ్వొకెట్ జనరల్ రామచందర్ రావు వివరించారు. ఈ కేసులో ఎస్సై రవీందర్ ను ఇప్పటికే సస్పెండ్ చేశామన్నారు.
అయితే ఎస్సై రవీందర్ ను ఎందుకు సస్పెండ్ చేసారని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కరీంనగర్ డిఐజి ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు ఈ కేసులో డిఐజి ని సుమోట్ గా 11 ప్రతివాదిగా చేరుస్తూ నిర్ణయం తీసుకుంది న్యాయస్తానం.
కరీంనగర్ సివిల్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకున్న పూర్తి మెడికల్ రిపోర్టు ను సివిల్ హాస్పిటల్ సూపర్ డెంట్ రెండు వారాల్లోగా సమర్పించాలని ఆదేశాలిచ్చింది హైకోర్టు. అదేవిధంగా కరీంనగర్ సబ్ జైల్ లో వారెంట్ ,గాయాల కు సంబంధించిన పూర్తి రిపోర్ట్ ను జైల్ సూపరింటెండెంట్ కూడా రెండు వారాల్లో హైకోర్టు కు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు ఎస్పీ విశ్వజిత్ ఈ మొత్తం వ్యవహారం లో కీలక సూత్రదారి అని అతని పై వెంటనే చర్యలు తీసుకోవాలని పిటిషనర్ తరపు న్యాయవాది రఘునాద్ హైకోర్టుకు విన్నవించారు. అయితే అన్ని రిపోర్టులు వచ్చాక దీనిపై పూర్తిగా విచారిస్తామని తెలిపింది న్యాయస్తానం. తదుపరి తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.
