57 మంది ఆదీవాసీలను ఫారెస్ట్ అధికారులు హైకోర్టు ముందు హాజరుపర్చాలని హైకోర్టు ఆదివారం నాడు  ఆదేశాలు జారీ చేసింది. 

హైదరాబాద్: 57 మంది ఆదీవాసీలను ఫారెస్ట్ అధికారులు హైకోర్టు ముందు హాజరుపర్చాలని హైకోర్టు ఆదివారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

57 మంది ఆదీవాసీలను ఫారెస్ట్ అధికారులు నిర్భందించారని ఆరోపిస్తూ పౌరహక్కుల సంఘం నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై ఇవాళ కోర్టులో వాదనలు జరిగాయి.

ఆదీవాసీలు తమ ఇష్టపూర్వకంగానే గెస్ట్‌హౌజ్‌లో ఉన్నారని ఫారెస్ట్ అధికారులు హైకోర్టులో చెప్పారు.ఈ వాదనతో హైకోర్టు ఏకీ భవించలేదు. ఆదీవాసీలను ఏసీ బస్సుల్లో హైద్రాబాద్ కు తరలించాలని హైకోర్టు ఆదేశించింది.