సూపర్ స్పెషాలిటీ మెడికల్ పీజీ కోర్సుల యాజమాన్య కోటా ఫీజులను రూ. 5 లక్షల నుండి రూ. 25 లక్షలకు పెంచుతూ  తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న  జీవోపై  స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 


హైదరాబాద్: సూపర్ స్పెషాలిటీ మెడికల్ పీజీ కోర్సుల యాజమాన్య కోటా ఫీజులను రూ. 5 లక్షల నుండి రూ. 25 లక్షలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న జీవోపై స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సూపర్ స్పెషాలిటీ మెడికల్ పీజీ కోర్సుయాజమాన్య కోటా ఫీజును రూ. 5 లక్షల నుండి రూ. 25 లక్షలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. పెంచిన ఫీజులు 2018-19 నుండి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే సూపర్ స్పెషాలిటీ మెడికల్ పీజీ కోర్సుల యాజమాన్య కోటా ఫీజును రూ. 5 లక్షల నుండి రూ. 25 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై హెల్త్‌కేర్ రిఫామ్స్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది.ఈ విచారణలో ఫీజుల పెంపునూ హైకోర్టు తప్పుబట్టింది.పీజులు పెంచుతూ ఇచ్చిన జీవోపై రాష్ట్ర ప్రభుత్వం స్టే విధించింది. ఫీజుల పెంపుపై స్టే విధించడాన్ని హెల్త్ కేర్ రిఫామ్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది.