హైదరాబాద్: మే 8వ తేదీ లోపుగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ను పూర్తి చేయాలని  హైకోర్టు తెలంగాణ ఇంటర్ బోర్డును ఆదేశించింది. సోమవారం నాడు తెలంగాణ ఇంటర్ ఫలితాలపై హైకోర్టు విచారించింది. బాలల హక్కుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ కేసుపై ఇవాళ విచారణ చేసింది.

మే 8వ తేదీన ఇంటర్ ఫలితా రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేస్తామని ఇంటర్ బోర్డు హైకోర్టుకు తెలిపింది. మే 8వ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఈ వివరాలను అందించాలని హైకోర్టు ఇంటర్ బోర్డును ఆదేశించింది.

గత హియరింగ్ సమయంలో  3.28 లక్షల మంది విద్యార్థుల పరీక్ష పత్రాలు రీ వాల్యూయేషన్ చేయడానికి ఎంత సమయం పడుతోందో చెప్పాలని హైకోర్టు ఇంటర్ బోర్డును ఆదేశించింది. 

ఆత్మహత్యలు చేసుకొన్న విద్యార్థుల జవాబు పత్రాలను హైకోర్టు ముందు ప్రవేశపెట్టాలని బాలల హక్కుల సంఘం తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. అయితే తర్వాతి విచారణలో  ఈ విషయమై ఆలోచిద్దామని  హైకోర్టు ప్రకటించింది.

బోర్డుతో పాటు తప్పులకు బాధ్యులపై చర్యల విషయమై కూడ తర్వాతి విచారణలో కోరుతామని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. గ్లోబరిన్ సంస్థ తప్పిదాల వల్లే విద్యార్థులకు నష్టం జరిగిందని త్రిసభ్య కమిటీ నివేదికను ఇచ్చిన విషయాన్ని  పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

సంబంధిత వార్తలు

మే 25‌ నుండి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు