సారాంశం

ణేష్ విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్‌ సాగర్‌తో పాటు నగరంలోని చెరువుల్లో పీవోపీ (ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్) విగ్రహాల నిమజ్జనం చేయొద్దని మరోసారి స్పష్టం చేసింది.

హైదరాబాద్: గణేష్ విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్‌ సాగర్‌తో పాటు నగరంలోని చెరువుల్లో పీవోపీ (ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్) విగ్రహాల నిమజ్జనం చేయొద్దని మరోసారి స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను అమలు చేయాలని నగర పోలీసు కమిషనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లను కూడా ఆదేశాలు జారీ చేసింది. పీవోపీ విగ్రహాలను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్‌ (నీటి కుంటలు)లో నిమజ్జనం చేయాలని సూచించింది.  ఇక, పీవోపీ విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధిస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పటికీ అమలులో ఉన్నాయని ఇదివరకే హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.