హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ల కేసులో అసెంబ్లీ సెక్రటరీ, లా సెక్రటరీలకు హైకోర్టు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది.ఈ కేసు విచారణను జూలై 13 వ తేదికి వాయిదా వేసింది.

ఈ ఏడాది మార్చిలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా  శాసనసమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ పై హెడ్‌ఫోన్ విసిరారనే ఆరోపణలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభసభ్యత్వాలను రద్దు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు  హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఎమ్మెల్యేల సభ్యత్వాలను తక్షణమే పునరుద్దరించాలని ఆదేశాలను జారీ చేసింది. దీనిపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయమై స్పీకర్ కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వినతిపత్రం సమర్పించారు. కానీ , ఫలితం లేకుండాపోయింది.

దీంతో కోర్టు ఆదేశాలను కూడ అమలు చేయడం లేదని ఆరోపిస్తూ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లు  హైకోర్టులో కోర్టు ధిక్కారణ పిటిషన్ ను దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై హైకోర్టు శుక్రవారం నాడు విచారణ జరిపింది. 

అసెంబ్లీ సెక్రటరీ, లా సెక్రటరీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జూలై 13 వ తేదికి కేసును వాయిదా వేసింది.కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిఎల్పీ నేత జానారెడ్డి ఇటీవలనే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.