తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు ఆపాలంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరికొంతమంది దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌కు లైన్ క్లియర్ అయ్యింది.

Also Read:తెలంగాణలో పుర పోరు: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల, జనవరి 22న పోలింగ్

రిజర్వేషన్ల ఖరారుకు, నోటిఫికేషన్ విడుదలకు మధ్య కేవలం 24 గంటలు మాత్రమే సమయం ఉండటంతో ఇది రాజ్యాంగ విరుద్ధమైన ఎన్నికల ప్రక్రియని ఉత్తమ్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

దీనిపై మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు న్యాయస్థానం సుదీర్ఘంగా విచారణ నిర్వహించింది. హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమీషన్ గత నెల 23న కసరత్తును ప్రారంభించింది. 

దీని ప్రకారం కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. 

* జనవరి 7న నోటిఫికేషన్
* జనవరి 8 నుంచి 10 వరకు నామినేషన్లు
* జనవరి 11న నామినేషన్ల పరిశీలన
* జనవరి 12, 13న తిరస్కరణకు గురైన నామినేషన్లకు అప్పీల్‌ చేసుకునే అవకాశం
* జనవరి 14న నామినేషన్ల ఉపసంహరణకు గడుబు
* జనవరి 22న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్
* జనవరి 25న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్