ఏపీ రాష్ట్రంలో సీబీఐని అనుమతి ఇవ్వకుండా తీసుకొన్న నిర్ణయంపై దాఖలైన పిల్‌ను మంగళవారం నాడు హైకోర్టు కొట్టేసింది.
హైదరాబాద్: ఏపీ రాష్ట్రంలో సీబీఐని అనుమతి ఇవ్వకుండా తీసుకొన్న నిర్ణయంపై దాఖలైన పిల్‌ను మంగళవారం నాడు హైకోర్టు కొట్టేసింది.
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను తమ చెప్పు చేతల్లోకి తీసుకొని ప్రత్యర్థి పార్టీలకు చెందిన సంస్థలు, వ్యక్తులపై దాడులకు పాల్పడుతోందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపిస్తున్నారు.
ఏపీ రాష్ట్రంలోకి సీబీఐ అనుమతిని నిరాకరిస్తూ నిర్ణయం తీసుకొంది. సీబీఐని ఏపీలోకి అనుమతించకుండా తీసుకొన్న నిర్ణయంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పిల్ ను హైకోర్టు మంగళవారం నాడు కొట్టేసింది. సీబీఐ విచారణను అనుమతిచ్చే విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.
ఏపీ రాష్ట్రం తీసుకొన్న ఈ నిర్ణయంపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. తాము తీసుకొన్న నిర్ణయాన్ని టీడీపీ నేతలు సమర్ధించుకొన్నారు.
