హైదరాబాద్: టీఆర్ఎస్‌ నుండి  కాంగ్రెస్ పార్టీలో చేరిన  ఇద్దరు ఎమ్మెల్సీలకు హైకోర్టులో చుక్కెదురైంది.  శాసనమండలి ఛైర్మెన్  ఉత్తర్వులు చట్టబద్దంగానే ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు తమపై అనర్హత వేటు వేయడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు.  ఎమ్మెల్సీలు  యాదవ రెడ్డి, రాములు నాయక్ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు  బుధవారం నాడు కొట్టివేసింది.

అయితే  తాము సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు ఎన్నికలు నిర్వహించకుండా ఆపాలని  కోరిన పిటిషనర్ల న్యాయవాది అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను ఈసీకి తెలపాలని హైకోర్టు  ఆదేశించింది.