రోడ్డు ప్రమాదంలో హీరో నానికి గాయాలు

First Published 27, Jan 2018, 7:23 AM IST
hero nani injured in road accident
Highlights
  • స్వల్ప గాయాలతో బయటపడ్డ నాని
  • సీటు బెల్టు పెట్టుకున్న నాని
  • ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో సేఫ్

ప్రముఖ సినీ హీరో నాని శుక్రవారం అర్దరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. జూబ్లిహిల్స్ లోని రోడ్ నెంబరు 45 లో ఈ ప్రమాదం జరిగింది. నాని ప్రయాణిస్తున్న కారు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో నాని స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సీటు బెల్టు పెట్టుకోవడం, కారులోని ఎయిర్ బ్యాగు ఓపెన్ కావడంతో నానితోపాటు డ్రైవర్ కూడా సేఫ్ గా బయట పడ్డారని తెలుస్తోంది. వెంటనే నాని అక్కడినుంచి వేరే కారులో తన ఇంటికి వెళ్లిపోయారు. కారు ముందు భాగం బాగా డ్యామేజ్ అయింది.

ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డ్రైవర్ కు బ్రీత్ అనలైజర్ పరీక్ష చేశారు. అయితే డ్రైవర్ మందు తాగలేదని తేలింది. తనకు నిద్ర  మత్తులో ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ పోలీసులకు తెలిపారు.

కృష్ణార్జున యుద్ధం సినిమా షూటింగ్ లో పాల్గొని తిరిగి ఇంటికెళ్లుండగా ఈ ప్రమాదం జరిగినట్లు నాని తర్వాత ట్విట్టర్ లో సమాచారాన్ని పోస్టు చేశారు. వారం రోజుల్లో తిరిగి షూటింగ్ లో పాల్గొంటానని తెలిపారు. తనకు పెద్దగా గాయాలేమీ కాలేదన్నారు.

loader