Asianet News TeluguAsianet News Telugu

శిల్పా చౌదరి : కిలాడీ లేడీ ఉచ్చులో హీరో మహేష్ బాబు సోదరి.. రూ. 2 కోట్లు మోసపోయానంటూ ఫిర్యాదు...

శిల్పా చౌదరి జైల్లో ఉందని తెలుసుకున్న ఆమె బాధితులు తమ వద్ద కూడా రూ. కోట్లలో నగదు తీసుకుని మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.  గండి పేటలోని  సిగ్నేచర్ విల్లాలో పదేళ్లుగా నివాసముంటున్న శిల్పా చౌదరి, శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ దంపతులు తమకు తాము ధనవంతులుగా ప్రకటించుకున్నారు.

hero mahesh babu sister duped rs. 2 crores by shilpa chowdary
Author
Hyderabad, First Published Dec 2, 2021, 8:23 AM IST

నార్సింగి :  మహిళలకు మాయమాటలు చెప్పి వారి వద్ద నుంచి రూ. కోట్లు కాజేసిన shilpa chowdary మోసాల్లో మరో కోణాన్ని పోలీసులు తెలుసుకున్నారు. 
Divanos పేరుతో జూదశాలను నిర్వహించిందని సాక్ష్యాధారాలు సేకరించారు.  ఇందులో 90 మంది సెలబ్రిటీల కుటుంబాల మహిళలు ఉన్నారని గుర్తించారు.

శిల్పా చౌదరి జైల్లో ఉందని తెలుసుకున్న ఆమె బాధితులు తమ వద్ద కూడా రూ. కోట్లలో నగదు తీసుకుని మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.  గండి పేటలోని  సిగ్నేచర్ విల్లాలో పదేళ్లుగా నివాసముంటున్న శిల్పా చౌదరి, శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ దంపతులు తమకు తాము ధనవంతులుగా ప్రకటించుకున్నారు.

టీవీ, సినీ నిర్మాతగా పరిచయం చేసుకున్న శిల్పాచౌదరి 
Cine celebrities కుటుంబాల్లోని మహిళలను వారాంతాల్లో పార్టీల పేరుతో ఆహ్వానించేది.  తొలుత కొంత మందితో మొదలైన Kitty partyలను తర్వాత జూదంగా  మార్చింది. దివానోస్ పేరుతో జూదశాలను  ప్రారంభించింది.  సంపన్న కుటుంబాలకు చెందిన మహిళల్లో  90 మందిని సభ్యులుగా చేర్పించుకుంది.  వారాంతాల్లో విందులు, వినోదాలు ఏర్పాటు చేసేది.

శిల్ప చౌదరి భర్త శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారన్న సమాచారంతో ఎక్కడెక్కడ భూములు కొన్నారు అన్న వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. కాగా, హీరో Mahesh Babu సోదరి ప్రియదర్శని కూడా తన వద్ద నుంచి రెండు కోట్లకు పైగా తీసుకుని శిల్పా చౌదరి మోసం చేసిందని.. కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని నార్సింగి పోలీసులు తెలిపారు. 

ఇదిలా ఉండగా బుధవారం శిల్ప చౌదరి చౌదరి పై ఓ ప్రముఖ సినీ  నటుడి భార్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.  తన వద్ద రూ. 2.9 కోట్లను  తీసుకుందని నార్సింగి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు శిల్పా చౌదరిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఆమె బాధితులు ఒక్కొక్కరుగా ఫిర్యాదులు చేస్తున్నారు.

ఒక్కొక్కరిగా బయటకొస్తున్న శిల్పా చౌదరి బాధితులు.. ఇలా ట్రాప్ చేసేదట..!!

కిట్టి పార్టీల లో శిల్పా చౌదరి పరిచయం అయిందని సదరు హీరో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళల నుండి ఆమె భారీగా డబ్బులు వసూలు చేసిందని పోలీసులు గుర్తించారు.  నార్సింగి  పోలీస్ స్టేషన్లో మొత్తం మూడు కేసులు  ఆమె మీద  నమోదయ్యాయి.  శిల్ప చౌదరి తిరిగి కస్టడీలోకి తీసుకుంటామని మాదాపూర్ డీసీపీ తెలిపారు.  కస్టడీ పిటిషన్ పై  బుధవారం హైకోర్టులో వాదనలు పూర్త పూర్తయ్యాయి అన్నారు.

శిల్పా చౌదరి కి చెందిన రెండు అకౌంట్ ప్లీజ్ చేశామని మాదాపూర్ డీసీపీ తెలిపారు మరికొన్ని అకౌంట్ లో కూడా శిల్ప చౌదరి కి ఉన్నట్లు గుర్తించామని మాదాపూర్ పోలీసులు తెలిపారు అయితే డబ్బులు చౌదరి ఎక్కడికి  తరలించిందన్న విషయమై ఆరా తీస్తున్నామని తెలిపారు.  

తాను సినీ పరిశ్రమలో ప్రొడ్యూసర్ నంటూ నమ్మబలికి ఒక్కొక్కరి వద్ద కోటి రూపాయల నుంచి ఐదు కోట్ల వరకు డబ్బులు వసూలు చేసింది.  ఈ క్రమంలోనే శిల్పా చౌదరి వ్యవహారాన్ని గుర్తించినా రోహిణి అనే బాధితురాలు తన నాలుగు కోట్ల రూపాయలను మోసపోయానని శనివారం నార్సింగి పోలీసులను ఆశ్రయించింది.  మంచిరేవుల లోని ఓ విల్లా లో తాను నివాసం ఉన్నట్లు రోహిణి తెలిపారు.  తనతో పాటు అనేక మంది వద్ద శిల్ప చౌదరి దాదాపు వంద కోట్లకు పైగా డబ్బులు తీసుకొని మోసం చేసిందని ఆరోపించింది.  ఈ మేరకు నార్సింగి పోలీసులు గండిపేట లోని సిగ్నేచర్ అపార్ట్మెంట్స్ కి వెళ్లి శిల్పా చౌదరిని అరెస్టు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios