Asianet News TeluguAsianet News Telugu

మా అన్నను చంపినవాళ్లను వదలను.. హేమంత్ సోదరుడు

చందానగర్ పరువు హత్య కేసులో పోలీసులు అవంతి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. అవంతి భర్త హేమంత్ హత్య కేసులో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అవంతి కుటుంబ సభ్యులే ఆమెనూ హేమంత్ ను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.

Hemanth brother comments over chandanagar   honor killing
Author
Hyderabad, First Published Sep 26, 2020, 1:22 PM IST


హైదరాబాద్ నగరంలో పరువు హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. తమ కుమార్తె తమకు నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కారణంతో.. అల్లుడిని అతి కిరాతకంగా హత్య చేశారు. కాగా.. ఈ ఘటనపై హైమంత్ తమ్ముడు స్పందించాడు. 

హేమంత్ హత్యపై తమ్ముడు సుమంత్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయే రెండు రోజుల ముందు అన్నయ్య తనకు ఫోన్ చేశారని..తామిద్దరం బిజినెస్ సంబంధించిన వివరాలు చర్చించుకున్నామని తెలిపారు. వీడియో కాల్ చేసి అన్న మృతదేహాన్ని తనకు చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నను చంపిన వారిని ఎవరినీ వదలనని హెచ్చరించారు. చెప్పులతో కొట్టుకుంటూ మరీ తీసుకెళ్లారని మండిపడ్డారు. వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో తమ కుటుంబ సభ్యులను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్లు సుమంత్ తెలిపారు. 

కాగా.. చందానగర్ పరువు హత్య కేసులో పోలీసులు అవంతి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. అవంతి భర్త హేమంత్ హత్య కేసులో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అవంతి కుటుంబ సభ్యులే ఆమెనూ హేమంత్ ను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. 

కిడ్నాప్ చేసింది. హత్య చేసింది కూడా అవంతి కుటుంబ సభ్యులేనని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 11 మంది పేర్లు బయటకు వస్తున్నాయి. వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. అవంతి తండ్రితో పాటు ఇతర బంధువులు కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు..

అవంతి తండ్రి లక్ష్మా రెడ్డి, యుగంధర్ రెడ్డి, విజేందర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, రాకేష్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఈ కేసులో నిందితులుగా గుర్తించారు. వారితో పాటు నలుగురు మహిళలు స్వప్న, స్పందన, రజిత, అర్చనలను కూడా పోలీసులు నిందితులుగా గుర్తించారు.

తెలంగాణలో ప్రణయ్ హత్య సంఘటనలాంటిదే మరో సంఘటన జరిగింది. కూతురి ప్రేమ వివాహం నచ్చని తండ్రి ఆమె భర్త హేమంత్ ను దారుణంగా హత్య చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంగారెడ్డి వద్ద హేమంత్ హత్య జరిగింది. అతన్ని ప్రేమ వివాహం చేసుకున్న యువతి మాత్రమే కారులోంచి తప్పించుకుని పారిపోయింది. 

తన కూతురి ప్రేమ వివాహం నచ్చని ఆమె తండ్రి ఆమె భర్తను కిరాయి గుండాలతో హత్య చేయించాడు. హేమంత్ ను, అతన్ని వివాహం చేసుకున్న యువతిని గురువారం మధ్యాహ్నం కిరాయి గుండాలో హైదరాబాదులోని గచ్చిబౌలిలో కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అతన్ని హత్య చేశారు. హేమంత్ మృతదేహం గచ్చిబౌలిలో కనిపించింది.

తమను కిరాయి గుండాలు కిడ్నాప్ చేసిన విషయాన్ని ప్రేమజంట 100కు ఫోన్ చేశారు. పోలీసులు గాలింపు జరుగుతుండగానే దారుణం వెలుగు చూసింది. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఆ జంట కొద్ది కాలం అజ్ఞాతంలోకి వెళ్లింది. తన ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నానని యువతి చెప్పడంతో ఆ తర్వాత ఇరు కుటుంబాలు రాజీకి వచ్చారు. 

అంతా సద్దుమణిగిందని భావించిన తరుణంలో హేమంత్ జరిగింది. హేమంత్ మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios