Asianet News TeluguAsianet News Telugu

సంక్రాంతికి పల్లె బాట పట్టిన జనం: హైద్రాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పల్లె బాట పట్టారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని తమ స్వంత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు ప్రయాణం కావడంతో విజయవాడ-హైద్రాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది.

Heavy traffic  on Hyderabad-Vijayawada highway ahead of Sankranti
Author
Hyderabad, First Published Jan 9, 2022, 1:05 PM IST

హైదరాబాద్: సంక్రాంతికి పట్టణ ప్రజలు పల్లె బాట పట్టారు. Andhra pradesh ప్రజలు sankranti పండుగను పెద్ద ఎత్తున జరుపుకొంటారు. ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం సందర్భంగా Hyderabadనగరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారంతా తమ స్వంత  ప్రాంతాలకు వెళ్తుంటారు.  ఇవాళ ఆదివారం కావడంతో పట్టణ ప్రాంత జనం పల్లెబాట పట్టారు. 

హైద్రాబాద్-Vijayawada జాతీయ రహదారిపై ఉన్న పంతంగి Toll gate, కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద పెద్ద ఎత్తున వాహనాల రద్దీ కన్పించింది. టోట్ గేట్ వద్ద వాహనాలు జామ్ కాకుండా ఉండేందుకు గాను టోల్ గేట్ సిబ్బంది తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.  తెలంగాణ రాష్ట్రంలోని విద్యా సంస్థలకు ఈ నెల 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కరోనా కేసుల పెరుగుదలను నిలిపివేసేందుకు ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చింది.

శనివారం నాడు కూడా  భారీగా వాహనాలు విజయవాడ వైపునకు వెళ్లడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చిట్యాలలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. మహాత్మాగాంధీ, జేబీఎస్ బస్టాండ్ ల నుండి ప్రయాణీకుల రద్దీ కూడా పెరిగింది.  ఉప్పల్, ఎల్బీ‌నగర్, బీహెచ్ఈఎల్, కూకట్‌పల్లి రీజియన్లలో ప్రైవేట్ బస్సులు కూడా  విజయవాడకు   క్యూ కట్టాయి.

ఇవాళ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పంతంగి టోల్‌గేట్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. సాధారణంగా ఈ జాతీయ రహదారిలో 10 వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయి.  అయితే పండుగ రద్దీని పురస్కరించుకొని ఇవాళ సుమారు 25 నుండి 30 వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయని  అధికారిక వర్గాల సమాచారం.

మరో వైపు సంక్రాంతి పర్వదినం పూర్తైన తర్వాత తిరిగి హైద్రాబాద్ కు పెద్ద ఎత్తున వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉంది. స్వంత గ్రామాలకు వెళ్లేందుకు గాను రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ప్రయాణీకులు క్యూ కట్టారు.  అయితే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో కరోనా జాగ్రత్తలు తీసుకోలేదు. ప్రయాణాలు చేసే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా కరోనా ప్రోటోకాల్ ను పాటించాలని వైద్య శాఖాధికారులు కోరుతున్నారు.సంక్రాంతి పర్వదినం సందర్భంగా  పట్టణ ప్రాంతాల నుండి పల్లెలకు జనం వెళ్తారు. అయితే ఎక్కడికి వెళ్లినా కూడా కరోనా ప్రోటోకాల్స్ ను పాటించాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులు సూచిస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మాస్క్ ధరించడంతో పాటు తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.దేశంలో కరోనా కేసుల సంఖ్య కూడా పెరిగింది. దేశంలో శనివారం నాడు 1.50 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.  మరో వైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరిగింది. మరో వైపు కరోనాపై ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ సాయంత్రం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోనున్నారు.


కొర్లపహాడ్ టోట్‌గేట్ వద్ద ట్రాఫిక్ జామ్

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొర్లపహాడ్ టోట్‌గేట్ వద్ద  మూడు కార్లు ఢీకొనడంతో  ట్రాఫిక్ జామ్ అయింది. ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ నుక్లియర్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios