ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దుతుగా సోమవారం కాంగ్రెస్ నేతలు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.  ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కరించడం లేదనే కారణంగా కాంగ్రెస్ నేతలు చేపట్టిన ఈ ప్రగతిభవన్ ముట్టడి కారణంగా .. సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివస్తుండటంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.

దీంతో ప్రగతి భవన్ కు దారితీసే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట వెళ్లే దారిలో ప్యారడైజ్ నుంచి బేగంపేట వరకు రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయాయి. వాహనాలు కొద్దిగా కూడా కదలలేని పరిస్థితి ఏర్పడింది.

ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లే ప్రయాణికులు గంటల తరపడి వాహనాలు నిలిచిపోవడం ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట మార్గం మీదుగా ప్రగతి భవన్ కు కాంగ్రెస్ నేతలు రాకుండా ఉండేందుకు పోలీసులు బేగంపేటలో భారీగా మోహరించారు..

ఇక్కడ ఆందోళనకారులు కనిపించిన వెంటనే అదుపులోకి తీసుకొని వివిధ పోలిస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. దీంతో సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి ప్రగతి భవన్ వరకు ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. మరోవైపు బేగంపేట వద్ద మెట్రో స్టేషన్లలోనూ పోలీసులు ఆంక్షలు విధించారు. ఆందోళనకారులు మెట్రో స్టేషన్ల గుండా అక్కడికి రాకుండా ఉండేందుకు భారీ భద్రత చేపట్టారు.ఇాదిలా ఉండగా... వరస సెలవల తర్వాత సోమవారం పాఠశాలలు తెరుచుకున్నాయి. దీంతో.. నగరంలో రద్దీ పెరిగింది.

ఇదిలా ఉండగా... 

నిన్నటి నుంచి పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న రేవంత్ రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 

ప్రగతిభవన్ ముట్టడి నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నుంచి రేవంత్ రెడ్డి ఆచూకీ లేకుండా పోయారు. ప్రగతిభవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించిన రేవంత్ రెడ్డి అన్నట్లుగానే రేవంత్ రెడ్డి ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించారు. 

నిన్నటి నుంచి అజ్ఞాతంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రగతిభవన్ ను ముట్టడించేందుకు బైక్ పై వచ్చారు. రేవంత్ రెడ్డిని గమనించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఎంతమంది పోలీసులు అడ్డుకున్నా ప్రగతిభవన్ గేటును తాకుతానని చెప్పిన రేవంత్ రెడ్డి అన్నట్లుగానే ప్రగతిభవన్ గేటను తాకారు. 
 
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రగతిభవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ప్రగతిభవన్ ముట్టడి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ముట్టడి నేపథ్యంలో  పోలీసులు కాంగ్రెస్ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తోంది. 

ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నేతలను సైతం అరెస్ట్ చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే పోలీసులు రేవంత్ రెడ్డి నివాసాలతోపాటు అనుచరులు ఇళ్లను తనిఖీలు చేశారు. 

అలాగే ప్రగతిభవన్ ఎదురుగా ఉన్న రెస్టారెంట్లను సైతం పోలీసులు తనిఖీలు చేపట్టారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేకించి బృందాలు సైతం రంగంలోకి దిగాయి. ఈ పరిణామాల నేథప్యంలో ఆకస్మాత్తుగా బైక్ పై ప్రగతిభవన్ చేరుకున్నారు రేవంత్ రెడ్డి.

అనంతరం అక్కడ నుంచి నేరుగా ప్రగతిభవన్ లోపలికి వెళ్లిపోయారు. ప్రగతిభవన్ ను ముట్టుకునే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి నల్ల టీషర్ట్ ధరించి ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. అనంతరం ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ప్రగతిభవన్ గేటును తాకుతానని తాను చెప్పానని అనుకున్నట్లుగానే తాను తాకినట్లు చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. తాను గేటు తాకానని కేసీఆర్ నియంత్వ పోకడలకు స్వస్తి చెప్పకపోతే నాలుగున్నర కోట్ల మంది ప్రగతిభవన్ ను ముట్టడిస్తారని హెచ్చరించారు. 

ఆర్టీసీ కార్మికులు సమస్యలను పరిష్కరించడం లేని టీఆర్ఎస్ ప్రభుత్వం తమకు వద్దన్నారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం దొంగల ప్రభుత్వం అంటూ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.