వామ్మో భారీ కొండ కొండచిలువ.. ! వర్షాల తర్వాత ఇండ్లల్లోకి చేరుతున్న పాములు..
Khammam: తెలంగాణలో కురిసిన భారీ వర్షాల తర్వాత చాలా ప్రాంతాల్లో ఇండ్లల్లోకి పాములు వచ్చి చేరుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షానికి ఖమ్మంలో ఒక భారీ పైతాన్ ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే, హైదరాబాద్ లోనూ పలు ప్రాంతాల్లో కొండచిలువలు, పాములు కనిపించాయి.
Telangana rainfall-snakes: తెలంగాణలో కురిసిన భారీ వర్షాల తర్వాత చాలా ప్రాంతాల్లో ఇండ్లల్లోకి పాములు వచ్చి చేరుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షానికి ఖమ్మంలో ఒక భారీ పైతాన్ ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు ప్రస్తుతం సోసల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే, హైదరాబాద్ లోనూ పలు ప్రాంతాల్లో కొండచిలువలు, పాములు కనిపించాయి. దీంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
వివరాల్లోకెళ్తే.. తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాములు నివాస ప్రాంతాల్లోకి చేరుతున్నాయి. భారీ వర్షాలకు మున్నేరు నదికి వరద పోటెత్తడంతో ఖమ్మం జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ క్రమంలోనే జిల్లాలోని వెంకటేష్ నగర్ లో ఓ ఇంట్లోకి భారీ కొండచిలువ ప్రవేశించింది. అనంతరం స్నేక్ రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని పైతాన్ ను పట్టుకున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అలాగే, గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల మధ్య హైదరాబాద్‌లోని పాలు ప్రాంతాల్లో కొండచిలువలు, పాములు ప్రత్యక్షమయ్యాయి. హైదరాబాద్‌లోనూ కొండచిలువలు ప్రత్యక్షమయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పురానాపూల్, కూకట్‌పల్లిలో రెండు పైతాన్ లు కనిపించాయి. తెలంగాణాలో కురిసిన వర్షాల కారణంగా ఏర్పడిన వరదలతో నగర శివార్లలోని అనేక ఇళ్ళు, కంపెనీలు, ఫ్యాక్టరీలలో ఇటీవల పాములు కనిపించినట్లు నివేదించబడింది.
పాములు ఇంట్లోకి ప్రవేశిస్తే..
గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. పాములు సాధారణంగా వరదనీటితో పాటు నివాస ప్రాంతాలలోకి ప్రవేశిస్తున్నందున, ఎవరైనా తమ నివాస ప్రాంతంలో లేదా ఇంట్లో సరీసృపాలు కనిపిస్తే ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం ఇవ్వాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. అలాగే, పాములు కనిపిస్తే ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ సెల్‌ఫోన్ నంబర్ 8374233366కు డయల్ చేసి సంప్రదించాలని చెప్పారు.