Heavy rains lash Telangana: తెలంగాణలో అతి భారీ వర్షాలు.. ప్రభుత్వ హెచ్చరికలు..

Hyderabad: తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగులో అత్య‌ధికంగా  650 మిల్లీ మీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల ప్రభావం నీటిపారుదల ప్రాజెక్టులు, రిజర్వాయర్‌లపై తీవ్రంగా పడింది. అనేక రిజర్వాయర్లు పొంగిపొర్లుతూ.. చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి.
 

Heavy rains lash Telangana: Extremely heavy rains in almost all districts, government warnings RMA

Heavy rains lash Telangana: తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగులో అత్య‌ధికంగా  650 మిల్లీ మీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల ప్రభావం నీటిపారుదల ప్రాజెక్టులు, రిజర్వాయర్‌లపై తీవ్రంగా పడింది. అనేక రిజర్వాయర్లు పొంగిపొర్లుతూ.. చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధ‌వారం రాత్రి త‌ర్వాత భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తోంది. ములుగులోని వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో ఉదయం 8 గంటల సమయానికి అత్యధికంగా 649.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో ఇప్పటివరకు 616.5 మిల్లీ మీట‌ర్లు,  భూపాలపల్లిలోని చెల్పూర్‌లో 475.8 మిల్లీ మీట‌ర్లు, రేగొండలో 467 మిల్లీ మీట‌ర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో 390.5 మిల్లీ మీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. 

మొన్నటి వరకు కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్ అతలాకుతలం అవుతుండగా, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తీవ్రత ఏ మాత్రం తగ్గలేదు. ఇక్క‌డ చాలా ప్రాంతాలు నీట మునిగాయి. అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌భుత్వం స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించింది. ముంపు ప్రాంతాల నుంచి ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాతాల‌కు త‌ర‌లిస్తోంది. ఇప్ప‌టికే వంద‌ల మంది స‌హాయక శిబిరాల‌కు త‌ర‌లించినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. చాలా జిల్లాల్లో 100-150 మిల్లీ మీట‌ర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. వర్షాల ప్రభావం నీటిపారుదల ప్రాజెక్టులు, రిజర్వాయర్‌లపై తీవ్రంగా పడింది. అనేక రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి.

హైదరాబాద్‌, జనగాం, భూపాలపల్లి, కరీంనగర్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌, హన్మకొండ, యాదాద్రి- భోంగీర్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ బులెటిన్‌లో పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ వెదర్‌మ్యాన్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిసిన టీ బాలాజీతో సహా స్వతంత్ర వాతావరణ విశ్లేషకులు, హైదరాబాద్ నగరం, మధ్య తెలంగాణలో చాలా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు ట్వీట్ చేశారు. నదులు, జలాశయాలు పొంగిపొర్లడం, రోడ్లు దెబ్బ‌తిన‌డం, నివాస ప్రాంతాలు ముంపునకు గురవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్ర‌భుత్వం సైతం ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రిస్తూ సుర‌క్షిత ప్రాంతాల్లో ఉండాల‌ని సూచించింది. స‌హాయం కోసం అధికారుల‌కు వెంట‌నే కాల్ చేయాల‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios