హైదరాబాద్ లో భారీ వర్షం.. పలుప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా...
అర్థరాత్రి నుంచి హైదరాబాద్ వాతావరణం మారిపోయింది. భారీ వర్షం కురుస్తోంది. ఎండవేడితో అల్లాడిన జనాలకు కాస్త ఊరట లభించింది.
హైదరాబాద్ : hyderabad నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన heavy rain కురుస్తోంది. ఖైరతాబాద్, అమీర్పేట్, పంజాగుట్ట, సికింద్రాబాద్, మారేడ్పల్లి, చిలకలగూడ, బోయిన్పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, బేగంపేట్, సైదాబాద్, చంపాపేట్, సరూర్నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, దిల్షుక్నగర్, నాగోల్, చైతన్యపురి, వనస్థలిపురం, హయత్ నగర్, తుర్కయంజాల్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్మెట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. భారీ వర్షానికి నగరంలోని రోడ్లపై Flood water పొంగిపొర్లుతోంది. పలు కాలనీలు నీటి మాయమయ్యాయి.
దిల్ షుక్ నగర్, చైతన్యపురి, కొత్తపేట తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పంజాగుట్ట కూడలి వద్ద భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షంతో గత కొద్ది రోజులుగా ఎండ వేడిమితో అల్లాడుతున్ననగర ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం లభించి నట్లయింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నేడు రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వర్షం కారణంగా జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని.. వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్దరిస్తామని TSSPCDL తెలిపింది.