హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మళ్లీ కురుస్తున్న వర్షం విధ్వంసం సృష్టిస్తూనే ఉంది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై ఉధృతంగా నీరు ప్రవహిస్తోంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ లు ఏర్పడ్జాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు 

ఫలక్ నుమాలో భారీ ప్రమాదం తప్పింది. రైల్వే వంతనపై హెద్ద గొయ్యి ఏర్పడింది. మధ్యలో ఆరు ఇంచుల వరకు వంతెన కూలిపోయింది. రైలు పట్టాలపై నీరు నిలిచింది. దాంతో రైళ్ల రాకపోకలను నిలిపేశారు వంతనపై నుంచి వెళ్లకుండా వాహనాలను దారి మళ్లించారు 

Also Read: హైదరాబాద్‌లో మళ్లీ కుండపోత : భారీగా ట్రాఫిక్ జాం.. వాహనదారుల అవస్థలు

ఇదిలావుంటే, హైదరాబాదులోని చాదర్ ఘాట్ వద్ద ఓల్డ్ మలక్ పేటలో ఓ వ్యక్తి విద్యుత్తు షాక్ తోమ మరణించాడు. రోడ్డుపక్కన ఉన్న కరెంట్ స్తంభాన్ని పట్టుకోవడంతో షాక్ కొట్టి మృత్యువాత పడ్డాడు. అతన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 40 ఏళ్ల రాములుగా గుర్తించారు. 

ఉప్పల్, ఫిర్జాదిగూడా, మేడ్చెల్, చైతన్యపురి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మేడిపల్లి - ఉప్పల్ రహదారిపై ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. మేడిపల్లి నుంచి ఉప్పల్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. అబ్దుల్లాపూర్ మెట్ - ఇనాంగుడా మధ్య ట్రాఫిక్ జామ్ అయింది. ఎల్బీ నగర్ లోని చింతల్ కుంట వద్ద ఇరువైపుల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. 

Also Read: హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం, పోటెత్తుతున్న వరద : తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాదులోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కాలనీల్లోకి మళ్లీ వరద నీరు వచ్చి చేరింది. దిల్ షుక్ నగర్, చంపాపేట, మలక్ పేట, ఎల్బీ నగర్, వనస్థలిపురం, కూకట్ పల్లి, బోరబండ, ఎర్రగడ్డ, అమీర్ పేట, పంజగుట్ట, జాబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలీంనగర్, మీర్ పేట, హయత్ నగర్, పాతబస్తీ, సైదాబాద్ వంటి ప్రాంతాల్లో వర్షం భారీగా కురుస్తోంది. 

కేబుల్ బ్రిడ్జిపై శని, ఆదివారాల్లో వాహనాల రాకపోకలను నిలిపేశారు. హిమాయత్ సాగర్ నుంచి మళ్లీ నీటి విడుదలర చేశారు. రెండు గేట్లు ఎత్తి మూసీ నదిలోకి నీటిని వదిలారు.