Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్‌లో భారీ వర్షం: నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు,వాహనదారుల ఇక్కట్లు

హైద్రాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  మరో గంట సేపు కూడ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Heavy rain lashes several  areas in hyderabad
Author
Hyderabad, First Published Sep 20, 2021, 7:40 PM IST

హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో  సోమవారం నాడు పలు చోట్ల  భారీ వర్షం కురిసింది. ఈ వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైద్రాబాద్ పాతబస్తీలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సికింద్రాబాద్ , ముషీరాబాద్, బోలక్‌పూర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, రాంనగర్,  కవాడీగూడ, ఇందిరా పార్క్, దోమలగూడ, విద్యానగర్, అడిక్ మెట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

బోయిన్‌పల్లి, చిలకలగూడ, మారేడ్‌పల్లి, బేగంపేట, ప్యాట్నీ సెంటర్. ప్యారడైజ్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.మరో వైపు సైదాబాద్ లో వరద నీటిలో ఓ మృతదేహం కొట్టుకువచ్చింది. మరో గంట పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు బయటకు రావొద్దని సూచించింది.ఇప్పటికే పలు ప్రాంతాలన్నీ నీటిలో మునిగిపోయాయి. రోడ్లపై వరద పోటెత్తింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ట్రాఫిక్ జాం ఏర్పడింది.

Follow Us:
Download App:
  • android
  • ios