హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది .బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. 

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, హైటెక్ సిటీ, యూసఫ్‌గూడ, ఫిల్మ్ నగర్, దుండిగల్, గండి మైసమ్మ, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, మూసాపేట, ప్రగతినగర్, నిజాంపేట‌లలో భారీ వర్షం పడుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు చేరింది. దీంతో కొన్నిచోట్ల ట్రాఫిక్‌‌కు అంతరాయం ఏర్పడింది. 

ఇక, తెలుగురాష్ట్రాల్లోని పలుచోట్ల మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు అరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.