తెలంగాణ‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌.. ఊపందుకున్న సాగు ప‌నులు..

Hyderabad: రెండు వారాలుగా ఎదురు చూస్తున్న రైతాంగానికి ఎట్టకేలకు రుతుపవనాల రాక ఆనందాన్ని నింపుతోంది. రాష్ట్రంలోని వివిధ‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం చిరుజల్లులు, శుక్రవారం కొద్దిపాటి వర్షం కురవడంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. అయితే, శ‌నివారం, ఆదివారాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) అంచ‌నా వేసింది. 
 

Heavy rain forecast for Telangana, Orange alert issued for several districts RMA

Heavy rains in Telangana: ఐఎండీ తెలంగాణ‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌ చేసింది. శని, ఆదివారాల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో శనివారం 115.6 నుంచి 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో ఏడు జిల్లాల్లో 64.5 నుంచి 115.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొన్న తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, ఆదిలాబాద్ లోని కొంత భాగంలో వ‌ర్షాలు కురుస్తున్నాయి.

రెండు వారాలుగా ఎదురు చూస్తున్న రైతాంగానికి ఎట్టకేలకు రుతుపవనాల రాక ఆనందాన్ని నింపుతోంది. రాష్ట్రంలోని వివిధ‌ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో గురువారం చిరుజల్లులు, శుక్రవారం కొద్దిపాటి వర్షం కురవడంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. అయితే, శ‌నివారం, ఆదివారాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) అంచ‌నా వేసింది.  జూన్ మొదటి వారంలో రుతుపవనాలు వస్తాయని రైతులు ఎదురు చూశారు. రుతుపవనాలు ఆలస్యం కావడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొన్ని గ్రామాల ప్రజలు వర్షదేవతను ప్రసన్నం చేసుకోవడానికి, వర్షాలు కురవాలని కోరుతూ కొన్ని ఆచారాలు నిర్వహించారు. అయితే గత రెండు రోజులుగా చిరుజల్లులు, మోస్తారు వ‌ర్షాలు కురుస్తుండటంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగు ప‌నులు మొద‌లు పెట్టారు. విత్త‌నాలు నాటుతున్నారు. 

కాగా, హైద‌రాబాద్ లోని బాలానగర్, చింతల్, కూకట్ ప‌ల్లి, మాదాపూర్, బేగంపేట, ఎల్బీనగర్, ఘట్కేసర్, కీసర, బంజారాహిల్స్, పంజాగుట్టతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజ‌ల్లులు లేదా మోస్తారు వ‌ర్షం ప‌డే అవ‌కాశ‌ముంది. యాదాద్రిలో గురువారం కురిసిన భారీ వర్షానికి పార్కింగ్ చేసిన కార్లు నీట మునిగాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైందని ఐఎండీ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. రుతుపవనాలు ప్రతి ఏటా జూన్ 8,10 తేదీల్లో తెలంగాణలోకి ప్రవేశిస్తాయని, ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని చెప్పారు. అయితే ఈ ఏడాది 12 రోజులు ఆలస్యంగా రుతుప‌వ‌నాలు రాష్ట్రాన్ని తాకాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన కొత్త అల్పపీడనం కారణంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఈ నెల 25, 26 తేదీల్లో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios