హైద్రాబాద్‌లో భారీ వర్షం: రోడ్లపై నిలిచిన వర్షం నీరు, ట్రాఫిక్ జామ్

హైద్రాబాద్ లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా  నగరంలోని పలు ప్రాంతాల్లో  వర్షం నీరు నిలిచి వాహనదారులు  ఇబ్బందులు పడ్డారు.

heavy rain fall leads to traffic jam in Hyderabad lns


హైదరాబాద్: ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన  ఆవర్తనం కారణంగా  హైద్రాబాద్ నగరంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.  ఈ వర్షం కారణంగా  రోడ్లపై  వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో  వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.  ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు  విధులకు హాజరయ్యేందుకు  వెళ్లే సమయంలో రోడ్లపై  కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ నిలిచిపోవడంతో  వాహనదారులు  ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల మేర రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. కొన్ని చోట్ల నెమ్మదిగా  వాహనాలు కదులుతున్నాయి.  ఒకవైపు వర్షం, మరో వైపు  ట్రాఫిక్ జామ్ తో  వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

రెండు  రోజులుగా  తెలంగాణ వ్యాప్తంగా  వర్షాలు కురుస్తున్నాయి.  రాష్ట్రంలోని  23 జిల్లాలకు ఐఎండీ   అలెర్ట్ జారీ చేసింది.  ఇవాళ ఉదయం నుండి హైద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. వర్షం నీరు  రోడ్లపై నిలిచిపోవడంతో  వాహనదారులు  తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం నీటిని తొలగించేందుకు  జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.   

నగరంలోని  జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్ పేట, ఫిల్మ్ నగర్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్,  దిల్ సుఖ్ నగర్,  ఎల్ బీ నగర్ , మాదాపూర్, మెహిదీపట్నం, మల్లెపల్లి, మాసబ్ ట్యాంక్,  మంగళ్ హట్, కార్వాన్, నిజాంపేట్,  తదితర ప్రాంతాల్లో  వర్షాలు కురుస్తున్నాయి.  వర్షం కారణంగా  డ్రైనేజీ మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయి.  రోడ్లపై  ఉన్న మ్యాన్ హోల్స్ నుండి  నీరు పొంగి పొర్లుతున్న కారణంగా  వాహనదారులు  ఇబ్బంది పడుతున్నారు.

హైద్రాబాద్ జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ ప్రాంతంలో  అత్యధికంగా  వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు.  హైద్రాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ అధికారులకు సూచించారు.  మరో వైపు డీఆర్ఎఫ్ ను సిద్దం  చేశారు.  జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీటిని తొలగించేందుకు అధికారులు సిద్దమయ్యారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios