తెరపైకి ఓటుకు నోటు కేసు: ఈ నెల 12 నుండి రోజువారీ విచారణ
ప్రజా ప్రతినిదులపై నమోదైన కేసులను సత్వరమే విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఓటుకు నోటు కేసును ఈ నెల 12వ తేదీ నుండి రోజు వారీగా విచారించనుంది కోర్టు.

హైదరాబాద్: ప్రజా ప్రతినిదులపై నమోదైన కేసులను సత్వరమే విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఓటుకు నోటు కేసును ఈ నెల 12వ తేదీ నుండి రోజు వారీగా విచారించనుంది కోర్టు.
ఈ కేసుపై ఇవాళ ఏసీబీ కోర్టు విచారించింది. ఈ విచారణలో ఆడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు అత్యంత కీలకం కానుంది.తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధికి డబ్బులు పంచే ప్రయత్నం చేస్తుండగా రేవంత్ రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసింది. అయితే ఈ కేసులో తనను ఉద్దేశ్యపూర్వకంగా ఇరికించారని రేవంత్ రెడ్డి అప్పట్లోనే ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈ కేసులో పలువురు ప్రజా ప్రతినిధుల పేర్లు బయటకు వచ్చాయి. దీంతో ఈ కేసు విచారణపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రోజువారీగా ఈ కేసు విచారణ సాగనుంది. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులపై సుమారు 4857 కేసులు పెండింగ్ లో ఉన్నాయని సుప్రీంకోర్టు కు అమికస్ క్యూరీ తెలిపింది.
యూపీ రాష్ట్రానికి చెందిన ప్రజా ప్రతినిధులపై అత్యధిక కేసులున్నాయి. ఆ తర్వాతి స్థానంలో బీహార్ రాష్ట్రం నిలిచింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.