కరోనా: రేపటి నుండి తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో కేంద్ర బృందం టూర్
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ నేతృత్వంలో కేంద్ర బృందం దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించనుంది.
హైదరాబాద్: కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ నేతృత్వంలో కేంద్ర బృందం దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించనుంది.
తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రల్లో లవ్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం ఈ ఏడాది జూన్ 26 నుండి 29 మధ్య పర్యటించనున్నారు.
ఆయా రాష్ట్రాలకు చెందిన వైద్య ఆరోగ్య శాఖాధికారులతో కేంద్ర బృందం సమావేశం కానుంది. కరోనా నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
దేశంలోని మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 1,42,900 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 10,444 కేసులు రికార్డయ్యాయి. గుజరాత్ రాష్ట్రంలో 28,943 కేసులు నమోదయ్యాయి.
ఆయా రాష్ట్రాల్లో వైద్య, ఆరోగ్య శాఖ తీసుకొంటున్న చర్యలను సమీక్షించి సలహాలు, సూచనలను ఇవ్వనున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను కూడ పరిశీలిస్తారు. దేశంలలో కరోనా కేసుల సంఖ్య 4లక్షల 73వేలు దాటాయి. అయితే కేసుల సంఖ్య పెరగడమే కాదు ఈ వైరస్ సోకిన రోగులు కూడ రికవరీ అవుతున్నట్టుగా ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.