హైదరాబాద్: తెలంగాణలో కూడా కరోనా సెకండ్ వేవ్ రావొచ్చని.. తెలంగాణ  మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు.

బుధవారంనాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. సెకండ్ వేవ్ వచ్చినా తీసుకొనే జాగ్రత్తలపై ఇప్పటికే సిద్దంగా ఉన్నామని ఆయన తెలిపారు.సెకండ్ వేవ్ వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా తాము సర్వం సిద్దంగా ఉన్నామని ఆయన చెప్పారు. క్షేత్రస్తాయిలో కూడా వైద్య సిబ్బందికి ఈ విషయమై జాగ్రత్తలు చెప్పినట్టుగా ఆయన తెలిపారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో  ప్రచారం నిర్వహించిన  కార్యకర్తలు కనీసం వారం లేదా 10 రోజుల పాటు  క్వారంటైన్ లో ఉండాలన్నారు.ప్రచారం నిర్వహించిన  కార్యకర్తలు కరోనా పరీక్షలు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రచారం నిర్వహించిన వారు మార్కెట్లు, వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందన్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి జిల్లాల నుండి కార్యకర్తలు, నేతలు వచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.  తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి.