భయం భయంగా వెళ్లిన విద్యార్థిని మీద ఆ కీచక ప్రధానోపాధ్యాయుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తరువాత ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. దీంతో బాలిక బాగా భయపడి తల్లితో సహా ఎవరికీ ఈ విషయాన్ని చెప్పలేదు.

శామీర్ పేట్ : విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువే దారి తప్పాడు. విద్యార్థినిపై Sexual assaultకి పాల్పడ్డాడు. మాజీ ప్రధానోపాధ్యాయురాలి జోక్యంతో చివరకు ఏడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం విశ్వసనీయ సమాచారం ప్రకారం… Shamirpet మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థిని (15) తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ నెల 22న యధావిధిగా schoolకి వెళ్ళింది. mask పెట్టుకోలేదనే కారణంతో తన గదిలోకి రావాల్సిందిగా విద్యార్థిని Headmaster ఆదేశించాడు.

ఏమంటాడో, ఏం పనిష్మెంట్ ఇస్తాడో నని భయం భయంగా వెళ్లిన విద్యార్థిని మీద ఆ కీచక ప్రధానోపాధ్యాయుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తరువాత ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. దీంతో బాలిక బాగా భయపడి తల్లితో సహా ఎవరికీ ఈ విషయాన్ని చెప్పలేదు.

అదే పాఠశాలలో గతంలో పనిచేసిన ప్రధానోపాధ్యాయురాలు బుధవారం అనుకోకుండా కలిసింది. ఆమె విద్యార్థిని కాస్త డల్ గా ఉండడం చూసింది. విద్యార్థిని కూడా ఆ ప్రధానోపాధ్యాయురాలితో ఉన్న చనువు కారణంగా.. బాలిక జరిగిన దారుణాన్ని ఆమె చెప్పింది. అది విన్న ఆమె ముందుగా షాక్ అయ్యింది. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ప్రధానోపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని చెప్పింది. 

తల్లికి విషయం చెప్పి, ధైర్యం చెప్పడంతో బాలిక, ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించారు. అయితే విషయం బయటికి పొక్కడంతో.. ఓ పార్టీ నేతలు ప్రధానోపాధ్యాయుడికి మద్దతుగా రంగంలోకి దిగారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిహారం ఇప్పిస్తామంటూ రాజీకి ప్రయత్నించారు.

ఈ సమాచారం తెలుసుకున్న మరో పార్టీ నాయకులు బాధిత బాలికకు మద్దతుగా నిలిచారు. దీంతో బాధితురాలి తల్లి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ సుధీర్కుమార్ పేర్కొన్నారు. 

రోడ్డుపై గుట్టలుగా కరెన్సీ నోట్ల తుక్కు.. అసలువా? నకిలీవా?

ఇదిలా ఉండగా, ఈ యేడాది ప్రారంభంలో జరిగిన ఇలాంటి ఘటనలో ఆ కీచక ప్రిన్సిపల్ కి మరణశిక్ష పడింది. వివరాల్లోకి వెడితే.. అభం శుభం తెలియని చిన్నారిపై కన్నేశాడు. పిల్లలకు విద్యా బుద్దులు నేర్పించాల్సిన ఆయనే దారి తప్పి.. చిన్నారి పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. ఐదో తరగతి చదువుతున్న చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా... చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఆ స్కూల్ ప్రిన్సిపల్ కు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఈ సంఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇదే కేసులో మ‌రో టీచ‌ర్‌కు జీవిత ఖైదు శిక్ష‌ను ఖ‌రారు చేశారు. స్పెష‌ల్ పోక్సో జ‌డ్జి అవ‌దేశ్ కుమార్ ఈ కేసులో తీర్పును వెలువ‌రించారు. విద్యార్థిని రేప్ కేసులో ప్రిన్సిపాల్‌కు మ‌ర‌ణ‌శిక్ష‌తో పాటు ల‌క్ష రూపాయ‌ల జ‌రిమానా విధించారు. మరో నిందితుడు అభిషేక్ కుమార్‌కు జీవిత‌శిక్ష‌ను ఖ‌రారు చేశారు. అత‌నికి 50 వేల ఫైన్ వేశారు. పాట్నాలోని ఫుల్‌వారి ష‌రీఫ్ ప్రాంతంలో ఈ స్కూల్ ఉంది.

2018 సెప్టెంబ‌ర్‌లో ఈ కేసు న‌మోదు అయ్యింది. 11 ఏళ్లు ఉన్న విద్యార్థిని త‌రుచూ వాంతులు చేసుకోవ‌డం వ‌ల్ల ఆమె పేరెంట్స్ డాక్ట‌ర్ వ‌ద్ద‌కు తీసుకువెళ్లారు. అయితే డాక్ట‌ర్ ప‌రీక్ష‌లో ఆ విద్యార్థిని ప్రెగ్నెంట్ అని తేలింది. త‌ల్లితండ్రులు ప్ర‌శ్నించ‌గా ఆ విద్యార్థిని జ‌రిగిందంతా చెప్పుకొచ్చింది. ఐపీసీ, పోక్సో చ‌ట్టాల కింద కేసు బుక్ చేశారు.