Asianet News Telugu

హెచ్‌సీఏ సభ్యుల పెంపు.. కొత్త జిల్లాల నుంచి ఆరుగురికి అవకాశం: అజారుద్దీన్ కీలక నిర్ణయం

తెలంగాణలో క్రికెట్‌ను మరింత విస్తరించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చర్యలు చేపట్టింది. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా హెచ్‌సీఏ సభ్యుల సంఖ్యను సైతం పెంచారు. అన్ని జిల్లాల్లో యువ క్రీడాకారులను ప్రోత్సహించనున్నారు.

hca president mohammad azharuddin extended members list ksp
Author
hyderabad, First Published Jun 19, 2021, 6:40 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తెలంగాణలో క్రికెట్‌ను మరింత విస్తరించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చర్యలు చేపట్టింది. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా హెచ్‌సీఏ సభ్యుల సంఖ్యను సైతం పెంచారు. అన్ని జిల్లాల్లో యువ క్రీడాకారులను ప్రోత్సహించనున్నారు. దీనిలో భాగంగా తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జిల్లాల నుంచి ఆరుగురికి హెచ్‌సీఏ సభ్యత్వం కల్పించారు. జిల్లా కోటాలో వాలా శరత్ చంద్ర, మఠం బిక్షపతి, బుద్ధుల శ్రవణ్ రెడ్డి, దాదాన్నగిరి సందీప్ కుమార్, దావా సురేశ్, మల్లిఖార్జున్‌లను హెచ్‌సీఏ ఎంజీఎం సభ్యులుగా చేరుస్తున్నట్లు అధ్యక్షుడు అజారుద్దీన్ ప్రకటించారు. వీరిని జిల్లాల అడహక్ కార్యదర్శులుగా నియమిస్తూ హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. 

Also Read:హెచ్‌సీఏ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. అజారుద్దీన్ స్పందన ఇది

కాగా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారం ప్రస్తుతం తెలుగునాట హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. టీమిండియా మాజీ కెప్టెన్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు నోటీసుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై గురువారం అజారుద్దీన్ మీడియా ముందుకు వచ్చారు. తనపై అనర్హత వేటు వేసే హక్కు అపెక్స్ కౌన్సిల్‌కు లేదని స్పష్టం చేశారు. అంబుడ్స్‌మెన్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని.. హెచ్‌సీఏ కార్యవర్గాన్ని రద్దు చేసే అధికారం అంబుడ్స్‌మెన్‌కు మాత్రమే ఉందని అజారుద్దీన్ పేర్కొన్నారు.

కార్యవర్గాన్ని రద్దు చేసి హెచ్‌సీఏకు మళ్ళీ ఎన్నిక నిర్వహించాలనుకుంటే అందుకు తాను సిద్ధంగా వున్నానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అధ్యక్షడి హోదాలో హెచ్‌సీఏను కంట్రోల్ చేసే బాధ్యత తనపై ఉందని... 25 ఏళ్ళుగా హెచ్‌సీఏను కొందరు వ్యక్తులు దోచుకుంటున్నారని అజారుద్దీన్ ఆరోపించారు. కోట్ల రూపాయల ఫండ్స్ వస్తున్నా.. ఉప్పల్ స్టేడియం తప్ప ఒక్క గ్రౌండ్‌ కూడా ఎందుకు అభివృద్ధి చేయలేదని ఆయన ప్రశ్నించారు. కొందరు వ్యక్తుల అవినీతికి అడ్డుపడుతున్నందుకే తనపై తిరుగుబాటు చేస్తున్నారని అజారుద్దీన్ ఆరోపించారు. హైద్రాబాద్ క్రికెట్ అభివృద్ధే తన లక్ష్యమని పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios