Asianet News TeluguAsianet News Telugu

హెచ్‌సీఏ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. అజారుద్దీన్ స్పందన ఇది

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారం ప్రస్తుతం తెలుగునాట హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. టీమిండియా మాజీ కెప్టెన్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు నోటీసుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై గురువారం అజారుద్దీన్ మీడియా ముందుకు వచ్చారు. తనపై అనర్హత వేటు వేసే హక్కు అపెక్స్ కౌన్సిల్‌కు లేదని స్పష్టం చేశారు

azharuddin reaction on kalvakuntla kavitha entry in hyderabad cricket association ksp
Author
Hyderabad, First Published Jun 17, 2021, 4:54 PM IST

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారం ప్రస్తుతం తెలుగునాట హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. టీమిండియా మాజీ కెప్టెన్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు నోటీసుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై గురువారం అజారుద్దీన్ మీడియా ముందుకు వచ్చారు. తనపై అనర్హత వేటు వేసే హక్కు అపెక్స్ కౌన్సిల్‌కు లేదని స్పష్టం చేశారు. అంబుడ్స్‌మెన్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని.. హెచ్‌సీఏ కార్యవర్గాన్ని రద్దు చేసే అధికారం అంబుడ్స్‌మెన్‌కు మాత్రమే ఉందని అజారుద్దీన్ పేర్కొన్నారు.

కార్యవర్గాన్ని రద్దు చేసి హెచ్‌సీఏకు మళ్ళీ ఎన్నిక నిర్వహించాలనుకుంటే అందుకు తాను సిద్ధంగా వున్నానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అధ్యక్షడి హోదాలో హెచ్‌సీఏను కంట్రోల్ చేసే బాధ్యత తనపై ఉందని... 25 ఏళ్ళుగా హెచ్‌సీఏను కొందరు వ్యక్తులు దోచుకుంటున్నారని అజారుద్దీన్ ఆరోపించారు. కోట్ల రూపాయల ఫండ్స్ వస్తున్నా.. ఉప్పల్ స్టేడియం తప్ప ఒక్క గ్రౌండ్‌ కూడా ఎందుకు అభివృద్ధి చేయలేదని ఆయన ప్రశ్నించారు. కొందరు వ్యక్తుల అవినీతికి అడ్డుపడుతున్నందుకే తనపై తిరుగుబాటు చేస్తున్నారని అజారుద్దీన్ ఆరోపించారు. హైద్రాబాద్ క్రికెట్ అభివృద్ధే తన లక్ష్యమని పేర్కొన్నారు. 

Also Read:అవినీతి బయటపడుతుందనే...: హెచ్‌సీఏ నోటీసులపై అజారుద్దీన్

మరోవైపు హెచ్‌సీయూ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అడుగుపెడుతున్నారన్న వార్తలపై అజార్ స్పందించారు. క్రికెట్ అసోసియేషన్ గాడి తప్పిందని కవిత చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని.. అలాగే కవిత పోటీ విషయం కూడా తనకు తెలియదని అజార్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చని.. దీనిలో తప్పేం లేదని ఆయన అన్నారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్‌పై కవిత దృష్టి పెట్టారని.. హెచ్‌సీఏను ప్రక్షాళన చేయడానికి ప్రయత్నిస్తున్నారని గతంలో వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios