Asianet News TeluguAsianet News Telugu

హెచ్ సీఏ నిధుల గోల్ మాల్ : మల్కాజ్ గిరి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన అజారుద్దీన్...

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడి అజారుద్దీన్ ముందస్తు బెయిల్ కోసం మల్కాజిగిరీ కోర్టును ఆశ్రయించారు. 

HCA funds Golmaal : Azharuddin filed anticipatory bail petition in Malkajgiri court - bsb
Author
First Published Oct 28, 2023, 7:55 AM IST

హైదరాబాద్ : హెచ్ సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ మల్కాజ్గిరి కోర్టును ఆశ్రయించారు. ముందస్తు  బెయిల్ ఇవ్వాలంటూ కోరారు.  హెచ్సీఏలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కోట్ల రూపాయల నిధులను గోల్మాల్ చేశారని అజారుద్దీన్ మీద కేసు నమోదైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అజారుద్దీన్ టెండర్ల పేరుతో థార్డ్ పార్టీకి నిధులు కట్టబెట్టారని కేసు నమోదు అయింది. అజారుద్దీన్ మీద జస్టిస్ లావ్ నాగేశ్వరరావు కమిటీ నాలుగు కేసులు పెట్టింది.

హెచ్సీఏలో 2020 నుంచి 2023 వరకు కోట్ల రూపాయలు నిధులను హెచ్సీఏలో స్వాహా చేశారని ఫారెన్సిక్ నివేదిక తెలిపింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ ఆగస్టు 10వ తేదీన హెచ్సీఏ నిధుల గోల్మాల్ ఆడిట్ నిర్వహించింది. ఈ ఆడిట్లో క్రికెట్ బాల్స్ కొనుగోలు వ్యవహారంలో భారీగా అవకతవకలు జరిగినట్లుగా గుర్తించింది. ఒక్కో బాల్ ను రూ. 392కు రూ. 1400 వర్క్ ఆర్డర్ చేసినట్లు వెలుగు చూసింది.

పట్టాలపై ఇరుక్కుపోయిన ట్రాక్టర్.. పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం..

క్రికెట్ బాల్స్ కొనుగోలు వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు 57 లక్షల రూపాయల నష్టం వాటిలినట్లుగా లావు నాగేశ్వరరావు కమిటీ తన ఆడిట్లో తేల్చింది. దీంతో పాటు బకెట్ కుర్చీల కొనుగోలులో కూడా ఇలాంటి అవకతవకలే జరిగాయి. ఈ కొనుగోలులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి రూ. 43 లక్షలు  నష్టం కలిగినట్లుగా తమ రిపోర్టులో కమిటీ  పేర్కొంది.

ఇక మరో అవకతవక ఫైర్ ఫైటింగ్ పరికరాల కొనుగోలు. ఈ పరికరాల కొనుగోలు వ్యవహారంలో రూ.1.50 కోట్లు హెచ్ సీఏకు నష్టం వచ్చింది. ఇక జిమ్ పరికరాల పేరుతో రూ.1.53  కోట్లు నష్టం చవిచూసింది.  ఇలా.. ఉప్పల్ పోలీసులు అజారుద్దీన్ మీద నాలుగు కేసులు నమోదు చేశారు.  కేసులు నమోదైనప్పటి నుంచి అజారుద్దీన్ అజ్ఞాతంలోనే ఉన్నారు.  ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ మల్కాజ్ గిరీ కోర్టులో  అజారుద్దీన్ పిటిషన్ వేశారు. అజారుద్దీన్ వేసిన ఈ బెయిల్ పిటిషన్ మీద మల్కాజిగిరి కోర్టు నవంబర్ ఒకటవ తేదీన విచారణ చేపట్టనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios