తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులను ఈ నెల 17వ తేదీ వరకు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.కూల్చివేత పనులపై విధించిన స్టేను రేపటి వరకు పొడిగించింది. సచివాలయం కూల్చివేత పనులపై ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారించింది.

సచివాలయం కూల్చివేత పనులకు కేంద్ర పర్యావరణ అనుమతులు కూల్చివేత పనులకు అవసరమా లేదో తెలపాలని అసిస్టెంట్ సోలిసీటర్ జనరల్ కు హైకోర్టు అదేశించింది. ఈ మేరకు నోటీసులు పంపింది.

 పర్యావరణ రెగ్యులెటర్ యాక్ట్ క్లియరెన్స్ కు సంబంధించి పలు జడ్జ్ మెంట్ లను అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు సమర్పించారు. భవనాల కూల్చివేతకు పర్యావరణ రెగ్యులెటర్ యాక్ట్ క్లియరెన్స్ అనుమతి అవసరం లేదని అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారు. 

ప్రిపరేషన్ ఆఫ్ ల్యాండ్ లో కూల్చివేత కూడా వస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించాడు. పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం 2018 కి విరుద్దంగా కూల్చివేత పనులు చేపడుతున్నారన్న పిటీషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఒక ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి లీగల్ రీజర్వమెంట్స్  తీసుకోవాలి కానీ కూల్చివేత కు అవసరం లేదని ప్రభుత్వ వాదించింది. 

కేంద్ర పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం ఎం చెపుతుందో తెలపాలని అసిస్టెంట్ సోలిసీటర్ జనరల్ ను ఆదేశించింది హైకోర్టు.పర్యావరణ రక్షణ  యాక్ట్ ప్రకారం భవనాల కూల్చివేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా  రెగ్యులేటరీ అనుమతి తీసుకోవాలని హైకోర్టు సూచించింది.

నూతన నిర్మాణాలు చేపట్టేటప్పుడు అన్ని అనుమతులు తీసుకుంటాని హైకోర్టు కు మరోసారి తెలిపారు అడ్వకేట్ జనరల్.జీహెచ్ఎంసీ, లోకల్ అథారిటీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనుమతులు సరిపోతాయని కోర్టు కు తెలిపాడు ఏజీ. ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. 

చిక్కుడు ప్రభాకర్, ప్రొఫెసర్ విశ్వేశ్వరావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారించింది. ఈ నెల 13వ తేదీ వరకు సచివాలయం కూల్చివేత పనులను నిలిపివేయాలని ఈ నెల 10వ తేదీన హైకోర్టు ఆదేశించింది.

ఈ నెల 13వ తేదీన తెలంగాణ హైకోర్టు ఈ విషయమై విచారణ చేసింది. సచివాలయం కూల్చివేత పనులపై మంత్రివర్గ తీర్మానాన్ని సీల్డ్ కవర్లో అందించాలని ఆదేశించింది. ఈ నెల 15వ తేదీ వరకు సచివాలయం కూల్చివేత పనులను నిలిపివేయాలని ఆదేశించింది. 

also read:తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులకు జూలై 16 వరకు హైకోర్టు బ్రేక్

బుధవారం నాడు హైకోర్టులో సచివాలయం కూల్చివేత పనులపై  విచారించింది. అదనపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీతో పాటు అన్ని శాఖల అనుమతులు తీసుకొన్నామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు.

కేబినెట్ తీర్మానం కాపీని హైకోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది ఇదివరకే అందించారు.  సచివాలయం కూల్చివేత పనుల విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. అప్పటి వరకు కూల్చివేత పనులపై స్టే కొనసాగనుంది.

గురువారం నాడు కూడ తెలంగాణ హైకోర్టు ఈ  పిటిషన్లను విచారించింది. ఈ పిటిషన్లపై విచారణను ఈ నెల 17వ  తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. అప్పటివరకు సచివాలయం కూల్చివేత పనులను స్టే కొనసాగుతున్నట్టుగా హైకోర్టు ప్రకటించింది.