జడ్చర్ల:పదో తరగతి విద్యార్ధిని హర్షిణిని హత్య చేసిన నవీన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. హర్షిణి మృతదేహంతో జడ్చర్లలో జాతీయరహదారిపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది.

ఫేస్‌బుక్‌లో పరిచయమైన నవీన్ రెడ్డి అనే యువకుడు పదోతరగతి విద్యార్ధిని హర్షిణిని తనతో కలిసి బయటకు రావాలని నవీన్ రెడ్డి మూడు రోజుల క్రితం కోరారు. దీంతో హర్షిణి బయటకు వెళ్లి శవమై తేలింది.

హర్షిణి తండ్రి జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో  సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. హర్షిణిని హత్య చేసిన నవీన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా  హయత్ నగర్ మండలం కోహెడకు చెందినవాడు.

హయత్‌నగర్ మండలం కోహెడకు చెందిన నవీన్ రెడ్డి కారు మెకానిక్ గా పనిచేస్తున్నాడు. నకిలీ ఫేస్‌బుక్ ఐడీని సృష్టించి నవీన్ రెడ్డి హర్షిణితో ఛాటింగ్ చేశాడు.మూడు రోజుల క్రితం హర్షిణి పెన్ కోసం బయటకు వెళ్లిన హర్షిణి ఆచూకీ లేకుండా పోయింది. నవీన్ రెడ్డి హర్షిణిని హత్య చేసినట్టుగా పోలీసులు తెలిపారు.

ఈ నెల 27వ తేదీ సాయంత్రం హర్షిణి ఆచూకీ లేకుండా పోయింది. ఇవాళ తెల్లవారుజామున హర్షిణి మృతదేహం లభ్యమైంది.నవీన్ రెడ్డితో పాటు  ఆయన కుటుంసభ్యులు పారిపోయారు. నవీన్ రెడ్డి ఇంటికి తాళం వేసి ఉంది. నవీన్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

హర్షిణి మృతదేహంతో కుటుంబసభ్యులు, విద్యార్ధిసంఘాలు గురువారం నాడు జడ్చర్లలో జాతీయ రహదారిపై బైఠాయించారు. నిందితుడు నవీన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.నవీన్ రెడ్డికి తాను  చేసిన తప్పు జీవితాంతం గుర్తుండేలా శిక్ష ఉండాలని  బాధితురాలి కుటుంబసభ్యులు కోరుతున్నారు.

హర్షిణి మృతదేహం పోస్టుమార్టం విషయంలో పోలీసుల వ్యవహరశైలిపై మృతురాలి కుటుంబసభ్యులు మండిపడుతున్నారు.జడ్చర్లలో పోస్టుమార్టం కాదని, మహాబూబ్ నగర్ కు తరలించాలని చెబుతున్నారన్నారు.

సంబంధిత వార్తలు

ప్రాణం తీసిన ఫేస్ బుక్ పరిచయం.. బండరాయితో మోది..