అకాల వర్షాలు, వడగండ్ల వానలకు తీవ్రంగా దెబ్బతిన్న పంటలను మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పరిశీలించారు. చిన్నకోడూరు మండలంలోని కమ్మరపల్లి, చౌడారం, మెడిపల్లి, అనంతసాగర్, చెర్ల అంకిరెడ్డి పల్లి, మల్లారం గ్రామాల్లోని వరి, మామిడి, మిర్చి పంటలను హరీశ్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలకు పంటలకు తీవ్ర నష్టం జరగడం బాధాకరమన్నారు. నష్టపోయిన పంటలపై నివేదిక తయారు చేయాల్సిందిగా వ్యవసాయ, ఉద్యానవన, రెవెన్యూ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు.

నివేదిక రాగానే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు రైతుల వద్దకే వస్తారని... ఇన్సూరెన్స్ చేసుకున్న వారికి సంబంధిత కంపెనీ ద్వారా సహాయం అందిస్తామన్నారు. రైతులకు ఆందోళన చెందాల్సిన పని లేదని... తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 

"